పుతిన్ కి సొంత ఇలాకాలో షాక్... ?

Update: 2022-02-25 06:50 GMT
రష్యా అధ్యక్షుడు పుతిన్ దూకుడు మీద ఉన్నారు. ఎవరి మాట వినను, తన మాట అంతకంటే వినను అన్న ధోరణిలో ముందుకు పోతున్నారు. ఉక్రెయిన్ మీద తన ఏళ్ళ నాటి ఉక్రోషాన్నిఅలా  తీర్చుకుంటున్నారు. మిలటరీ ఆపరేషన్ అని కనికట్టు కధలు చెప్పి ఇపుడు చిన్న దేశం మీద భీకర యుద్ధమే చేస్తున్నారు. సైనిక స్థావరాల మీదనే దాడులు అంటూ మాయ కబుర్లు చెబుతూ ఏకంగా జనవాసాల మీదనే బాంబుల వర్షం కురిపిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలీ అంటే ఉక్రెయిన్ ని అడ్డం పెట్టుకుని ప్రపంచానికి తాను ఏంటో చూపించాలన్న పుతిన్ దుర్నీతి ఒకటి ఇక్కడ అర్ధమవుతోంది.

పుతిన్ ఇలా మరో దేశం మీద అకారణంగా యుద్ధం చేస్తూ పచ్చని దేశాన్ని శ్మశానం చేఅస్తూ ఉంటే ఆయన సొంత దేశం రష్యా జనాలు భేష్ పుతిన్ అంటున్నారా. ధీరుడూ శూరుడూ పుతిన్ అని చప్పట్లు కొడుతున్నారా అంటే. అలాంటి సీనే లేదు అని అంటున్నారు. రష్యా జనాలకు పుతిన్ నిజ స్వభావం పూర్తిగా తెలుసు. ఆయన పాలన మీద వారికి పూర్తి వ్యతిరేకత ఉంది.

అయితే నియంత మాదిరిగా మారి పుతిన్ జనాల నోళ్ళు నొక్కుతున్నాడు. అయినా సరే నిరసన కారులు వందలాది మంది మాస్కో వీధుల్లోకి వచ్చి మరీ పుతిన్ మీద విమర్శలు చేస్తున్నారు. యుద్ధాన్ని ఆపాల్సిందే అంటూ నినదిస్తున్నారు. మాస్కోతో పాటు దేశంలోని పలు నగరాల్లో నిరసనకారులు రోడ్లెక్కారు. నో టు వార్,  స్టాప్ వార్,  పుతిన్ లైస్  అంటూ నినదిస్తున్నారు.

అంతే కాదు ఉక్రెయిన్ కి సారీ కూడా చెబుతున్నారు. పుతిన తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇలా యుద్ధం వైపు మళ్ళారని కూడా నిరసనకారులు అంటున్నారు.

మొత్తానికి చూస్తే ఉక్రెయిన్ పీచమణచాను అని తెగ సంతోషిస్తున్న రష్యా అధినేతకు సొంత ఇలాకాలో మాత్రం నిరసనలే స్వాగతం పలుకుతున్నాయి. దేశం నిండా ఎన్నో అంతర్గత సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించలేని పుతిన్ యుద్ధానికి బయల్దేరాడని రష్యన్లు అంటున్నారు.

పుతిన్ తన యుద్ధ దాహానికి రష్యాను బలిపెడుతున్నారని కూడా అంటున్నారు. రేపటి రోజున రష్యా ప్రపంచ దేశాల నుంచి అనేక ఆంక్షల‌ను ఎదుర్కొంటే నష్టపోయేది ప్రజలేనని కూడా వారు అంటున్నారు. పుతిన్ పాలనలో  ప్రతిపక్ష నేతలకు నోరు విప్పే స్వేచ్చ లేదని కూడా అంటున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పటికి ఇలా యుద్ధం వద్దు అంటూ అందోళన చేస్తున్న 1400 మందిని రష్యా పోలీసులు ఉక్కు పాదాన్ని మోపి మరీ  అరెస్ట్ చేశారు. వారిలో సగం మంది మాస్కోకు చెందినవారు అయితే మరింతమంది  సెయింట్ పీటర్స్ బర్గ్ కి చెందిన వారు. మొత్తానికి చూస్తే పుతిన్ మీద సొంత దేశంలో నిరసన పెరిగిపోతోంది. అయినా సరే పుతిన్ తన రూటే సెపరేటూ అంటూ సాగడమే విశేషం.
Tags:    

Similar News