క్యాబినెట్ నడిపేందుకు సమర్థులు కావాలి..అని కొడాలి నాని అనే మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. తాజా మాజీ అని రాయాలి.ఎందుకుంటే నిన్నటి వేళ అంటే ఏప్రిల్ ఏడున సీఎం ఆదేశాలు అనుసరించి పదవికి రాజీనామా చేసి మరో మారు విధేయుడు అని అనిపించుకున్నారు కనుక! ఇదేవిధంగా మిగతా 23 మంది కూడా తమ విధేయతకు కొనసాగింపు ఇచ్చిన వారే!అంటే జగన్ పై భక్తి ప్రకటించి తమని తాము నిరూపించుకున్న వారే ! ఆ విధంగా ఆఖరి క్యాబినెట్ మీటింగ్ ఈ టీంతో ఏర్పాటు చేయాలనుకున్న ప్రకారం నిర్వహించి, ఏవో రెండు మూడు నిర్ణయాలు (వాళ్లకు అనుకూలం అనుకున్నవి) తీసుకుని మమ అనిపించారు. ఇందులో ఒక నిర్ణయం కొంచెం బెటర్.
ప్రభుత్వంలో విలీనం అయిన ఎయిడెడ్ మరియు నాన్ ఎడిడెడ్ డిగ్రీ కళాశాలలో పోస్టుల భర్తీకి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదేవిధంగా వేతన సవరణ జీఓకు ఆమోదం. ఇవి తప్ప పెద్దగా చెప్పుకోదగ్గవి ఏమీ లేదు. జెడ్పీల కాలపరిమితికి సంబంధిత కార్యాచరణకు ప్రాణ సంకటం లేకుండా పంచాయతీ రాజ్ చట్టంలో సవరణ తెస్తూ తీసుకువచ్చిన ఆర్డినెన్స్ కు ఆమోదం చెప్పారు. ఇవీ తప్ప మరేమీ లేవు. ఇక సమర్థుల విషయానికే వద్దాం.
వాస్తవానికి ఏపీ క్యాబినెట్ లో ఉన్నవారంతా సమర్థులే ఎలా అంటే విపక్షాన్ని నోటికి వచ్చినంత తిట్టడంలో సమర్థులు. జగన్ కు అనుగుణంగా తిట్టడంతోనే వారి కాలం సరిపోయింది. నిన్నక్యాబినెట్ భేటీ ముగిశాక నాని చేసిన వ్యాఖ్యలు చాలా అంటే చాలా హుందాగానే ఉన్నాయి. ఏం చెప్పి పంపారో కానీ చాలా రోజులకు బూతులు లేవు. ఇక పై విశ్వరూపం చూపిస్తానని ఆగడాగండి తొందరెందుకు అని వ్యాఖ్యానిస్తూ, తాను ప్రొటొకాల్ వెహికల్ వాడను అని ఇప్పుడే కాదు ఎప్పుడూ లేదని పేర్కొంటూ సొంత వాహనంలో వెళ్లిపోయారు.
ఇక మంత్రి సమర్థత గురించి చెప్పుకోవాలి.. ఆయన నిర్వహించిన పౌర సరఫరాల శాఖకు సంబంధించి అనేక ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా జిల్లాలు దాటి రాష్ట్రం దాటి పేదల బియ్యం పరదేశానికి తరలిపోతోందని పత్రికల్లో కథనాలు వచ్చాయి.
వాటిని కూడా పట్టించుకోలేదు. ఆ రోజు కాకినాడ సీ పోర్ట్ లో ఏం జరిగిందో కూడా రాశాయి. అయినా పట్టించుకోలేదు. ప్రభుత్వం పేదలకు పంపిణీ నిమిత్తం ఇచ్చిన చౌక బియ్యం మరింత సులువుగా దేశం దాటిపోతే అధికారులు సిబ్బందికి ఛార్జి మెమోలు ఇచ్చి సరిపెట్టారు. ఇదీ ప్రత్యేకం అనుకున్న సమర్థతకు తార్కాణం. ఇక చంద్రబాబును, లోకేశ్ ను ఇష్టం వచ్చిన విధంగా తిట్టడం మినహా ఆయన పెద్దగా సాధించింది ఏమీ లేదు.
ఆ విధంగా ఆయన మరోసారి ఇంకోసారి జ్ఞప్తికి వస్తారు. ఇంకా చెప్పాలంటే పండగ వేళ క్యాసినో నిర్వహించారు అని గుడివాడ కేంద్రంగా ఉన్న కన్వెన్షన్ హాలు కేంద్రంగా చాలా జరిగాయి అని ఆరోపణలు వచ్చినా టీడీపీ నాయకులను బండ బూతులు తిట్టడం మినహా న్యాయ విచారణకు ఒప్పుకోకపోవడంలో ఆయన గుర్తుకు వస్తారు.ఆయన సమర్థత కూడా గుర్తుకువస్తుంది. ఇవి కాక ఏమయినా ఉంటే అవన్నీ మొబైల్ వెహికల్ డ్రైవర్లే చెప్పాలి. ఎందుకంటే వెహికల్ ఇన్సూరెన్స్ పేరిట 18 వేలకు పైగా ప్రభుత్వం వారి దగ్గర నుంచి గుంజుకున్నా మంత్రి పట్టించుకోలేదు కనుక ఆ చాలీచాలని జీతగాళ్ల గోడు పట్టించుకోని వ్యక్తిగా ఆయన ఎప్పటికీ గుర్తుండి పోతారు. వెళ్లి రా నాని వెళ్లి రా అంటోంది టీడీపీ.