దేశ వ్యాప్తంగా పెను సంచలనంగా మారిన 'ది కశ్మీర్ ఫైల్స్' మూవీ కోట్లాది మెదళ్లకు సరికొత్త పని మొదలుపెట్టింది. చరిత్రలో జరిగిన ఈ దారుణ నరమేధం గురించిన వివరాలు ఇంతకాలం ఎందుకు పెద్దగా బయటకు రాలేదు. చిన్న చిన్న సంఘటనలకు గొంతులు చించుకునే మేధావులంతా పండిట్ల నరమేధం గురించి నోరు మూసుకొని ఎందుకు ఉండిపోయారు? లాంటి ప్రశ్నలు ఇప్పుడు చాలామందికే వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమాను ఉద్దేశించి కొందరు చేస్తున్న ప్రచారం చూసినప్పుడు ఇలాంటి వారిని ఏం చేయాలన్న భావన కలుగక మానదు.
ఈ సినిమాలో నిజం కంటే కూడా వాస్తవాన్ని ఎక్కువ చేసి చూపేలా సినిమాను తీశారన్న విషాన్ని కక్కుతున్న వారి సంఖ్య ఈ మధ్యన ఎక్కువైంది. దీంతో.. ఇప్పుడు ఈ సినిమాపై సరికొత్త చర్చ మొదలైంది. ఇలాంటి వేళలోనే.. ఈ సినిమాలో ప్రస్తావించిన ఉదంతాల గురించి తక్కువ చేసి చూపేలా చేస్తున్న వారితో సహా అందరూ షాక్ తినే ఉదంతం ఒకటి అదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగినట్లుగా చెబుతున్నారు.
అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని నటరాజ్ థియేటర్ లో జరిగిన గొడవ సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ.. జర్నలిస్టు సర్కిల్స్ లోనూ హాట్ టాపిక్ గా మారింది.
కశ్మీర్ ఫైల్స్ మూవీ ప్రదర్శిస్తున్న సమయంలో థియేటర్ లో సినిమా చూస్తున్న వ్యక్తి ఒకరు పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయటంతో గందరగోళం చోటు చేసుకుంది. సదరు వ్యక్తి అదే పనిగా పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయటంతో ఆగ్రహించిన ప్రేక్షకులు సదరు వ్యక్తిని చితకబాదారు.
దీంతో.. ఆ వ్యక్తి బయటకు పరుగులు తీసి పరారైనట్లుగా చెబుతున్నారు. ఈ ఉదంతం జరిగిన నాలుగు గంటల తర్వాత ఈ విషయం బయటకు రావటం గమనార్హం. అయితే.. ఈ ఉదంతం గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. ఈ అంశంపై స్పందిస్తూ..తాగిన మత్తులో గొడవ జరిగినట్లుగా చెబుతున్నారు.
అయినా.. దాయాది దేశాన్ని సమర్థించేలా.. సొంత దేశాన్ని అవమానించేలా నినాదాలు చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదు? ఇలాంటి వాటిని ఎందుకు సహించాలి? ఇలాంటి నినాదాలు కశ్మీర్ వ్యాలీలోని కొందరు కశ్మీరీ ముస్లింలు చేస్తారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ.. అదిలాబాద్ పట్టణంలోని వారు చేస్తున్నారంటే.. మానవతావాదులు దీని గురించి ఏమంటారు? దీన్ని ఎలా సమర్థించుకుంటారు?