మిర్యాలగూడ వ్యాపారి.. తన మాట కాదని నచ్చినోడ్ని కూతురు పెళ్లి చేసుకుంటే.. సుపారి ఇచ్చి అతగాడ్ని చంపించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న మారుతిరావు ఆత్మహత్య ఉదంతం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. హత్య కేసు కు సంబంధించి లాయర్ తో మాట్లాడేందుకు వచ్చిన మారుతిరావు.. ఖైరతాబాద్ ఆర్యవైశ్య భవనంలో అనుమానాస్పద రీతిలో మరణించారు.
ఆయన సూసైడ్ చేసుకున్నట్లు చెబుతున్నా.. అందుకు సంబంధించిన ఆధారం దొరక్కపోవటం ఇప్పుడు కొత్త అనుమానాలకు తెర తీస్తోంది. ఆర్యవైశ్య భవన్ లోని రూంలోకి వెళ్లిన తర్వాత.. గారెలు తెప్పించుకు తిన్న మారుతిరావు.. కాసేపటికే వాంతులు చేసుకున్నట్లు గా బెడ్ పక్కన ఉన్న రక్తపు వాంతుల్ని చూస్తే అర్థమవుతుంది. గారెలు తిన్నంతనే ఎవరూ చనిపోరు. అలా అని.. గారెల్లో విషం కలుపుకు తిన్నారా? అంటే.. దానికి సంబంధించిన బాటిల్ కానీ ప్యాకెట్ కానీ ఎక్కడ? అన్నది మరో ప్రశ్న. విషం తీసుకొని ఆత్మహత్య చేసుకొని ఉంటారన్న దానికి తగ్గ ఆధారం లభించకపోవటం పలు అనుమానాలకు తావిస్తోందని చెబుతున్నారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ కు చేరుకున్న మారుతిరావు.. లాడ్జిలో రూం తీసుకున్న తర్వాత తనను ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు నిద్ర లేపాలని చెప్పటం.. ఆ సమాయానికి వచ్చి చూస్తే.. విగతజీవి గా కనిపించటం పలు సందేహాలకు తావిస్తోంది.
మారుతిరావు బస చేసిన హోటల్ పరిసరాలకు చెందిన సీసీ కెమేరాల ఫుటేజ్ ను విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో ఫోరెన్సిక్ సిబ్బంది.. క్లూస్ టీం పలు ఆధారాల్ని సేకరించింది. ఉస్మానియాలో మారుతిరావు డెడ్ బాడీకి పోస్టుమార్టం చేశారు. ఈ రిపోర్టు వస్తే కానీ.. కొన్ని ఆనవాలైన బయటకు వచ్చే వీలుందన్న మాట వినిపిస్తోంది.