కాకినాడ నుంచే ప‌వ‌న్ పోటీ?.. రీజ‌న్ ఇదేనా?

Update: 2022-03-15 09:39 GMT
వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎక్క‌డ నుంచి పోటీ చేయ‌నున్నారు?  అనే ప్ర‌శ్న త‌ర‌చుగా వినిపిస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో విశాఖ‌లోని గాజువాక‌, ప‌శ్చిమ గోదావ‌రిలోని భీమ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గాల నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన ప‌వ‌న్ ప‌రాజ‌యం పాల‌య్యారు. అయితే.. ఈ ద‌ఫా.. ఆయ‌న ఇక్క‌డ నుంచి పోటీ చేసే అవ‌కాశం లేద‌ని.. తెలుస్తోంది. ఆయ‌న చూపు ఇప్పుడు కాకినాడ‌పై ఉన్న‌ద‌ని అంటున్నారు. తూర్పుగోదా వ‌రి జిల్లా కాకినాడ సిటీ నియోజ‌క‌వ‌ర్గంపై ప‌వ‌న్ దృష్టి ఉన్న‌ట్టు స‌మాచారం.

తాజాగా జ‌న‌సేన 9వ ఆవిర్భావ స‌భ‌లో ప‌ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌ను గ‌మ‌నించిన వారు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ న కాకినాడ సిటీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయ‌డం ఖాయ‌మ‌నే వాద‌న‌ను వినిపిస్తున్నారు. ఎలాగంటే.. ఇక్క‌డ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి దూకుడు ఎక్కువ‌గా ఉంది. దీనినే తాజా స‌మావేశాల్లో ప‌వ‌న్ ప్ర‌శ్నించారు.

పోలీసుల‌పైనే వైసీపీ నాయ‌కులు తిర‌బ‌డుతున్నారంటూ.. ప‌రోక్షం గా ద్వారం పూడిని టార్గెట్ చేశారు. అదేస‌మ‌యంలో మ‌త్తు ప‌దార్ధాల‌ను కూడా దిగుమ‌తి చేసుకుంటున్నా రంటూ..ద్వారంపూడి పై విప‌క్షాలు విరుచుకుప‌డుతున్నాయి.

ఈ నేప‌థ్యానికి తోడు వైసీపీలోనూ ఆయ‌న ఇప్పుడు ఒంటరి అయ్యారు. ఏ నేత‌తోనూ స‌ఖ్య‌త‌గా మెల‌గ‌లేక పోతున్నారు. ఇక‌, కాపు సామాజిక వ‌ర్గం ఎక్కువ‌గా ఉన్న ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో ద్వారం పూడి గెలుపున‌కు కృషి చేశారు.

అయితే.. వారిని ఎమ్మెల్యే ప‌ట్టించుకోలేద‌నే టాక్ ఉంది. ఇలాంటి ప‌రిస్థితిలో ప‌వ‌న్ వంటి బ‌ల మైన నాయ‌కుడు ఇక్క‌డ నుంచి బ‌రిలోకి దిగితే.. కాపుల ఓట్లు స‌మీక‌రించుకుని ఆయ‌న విజ‌యం సాధించేందుకు అవ‌కాశం ఉంటుంద‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి.

ఈ విష‌యాన్ని ప‌రిశీల‌న‌లో ఉంచుకునే ప‌వ‌న్ ద్వారంపూడిపై విరుచుకుప‌డ్డార‌ని విశ్లేష‌కులు సైతం చెబుతున్నారు. సో.. ఎలా చూసుకున్నా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాకినాడ సిటీ నుంచి ప‌వ‌న్ పోటీ చేయ‌డ‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు.
Tags:    

Similar News