జగన్ సర్కార్ కు ఊరట.. కేంద్రం నుంచి తీపికబురు..

Update: 2022-02-17 06:31 GMT
జగన్ సర్కార్ కు కేంద్రం నుంచి తీపికబురు అందింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. పోలవరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల విషయంలో రెండేళ్ల పాటు ప్రభుత్వానికి ఊరట దక్కింది. వచ్చే జూలై 2 వరకూ ‘స్టాప్ వర్క్  ఆర్డర్’ను నిలుపుదల చేస్తూ కేంద్ర అటవీ,పర్యావరణ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

గత ఏడాది జూలై 2 నుంచి పోలవరం పనులపై కేంద్రం నిషేధం విధించింది. అయితే రాష్ట్ర అభ్యర్థన మేరకు తాజాగా స్టాప్ వర్క్ ఆర్డర్ ను వచ్చే ఏడాది జూలై వరకూ నిలుపుదల చేసింది.

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. పోలవరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల విషయంలో రెండేళ్ల పాటు ప్రభుత్వానికి ఊరట దక్కింది. అనుమతులు లేని కారణంతో 2011లో పనుల నిలుపుదల ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర పర్యావరణ శాఖ. 2015లో ఈ ఉత్తర్వులను అభయెన్సులో పెట్టిన కేంద్ర ప్రభుత్వం ఆ అభయెన్సు ఉత్తర్వులను ప్రతీ ఏటా కొనసాగిస్తూ వస్తోంది.

మరోసారి దాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఏపీ ప్రభుత్వం, కేంద్ర జలశక్తి అభ్యర్థన మేరకు రెండేళ్ల పాటు కొనసాగించింది. ఈ మేరకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Tags:    

Similar News