రాయబరేలీని గాంధీ ఫ్యామిలి వదిలేసినట్లేనా ?

Update: 2022-03-02 01:30 GMT
ఉత్తరప్రదేశ్ లోని రాయబరేలి అంటేనే గాంధీ ఫ్యామిలికి కంచుకోటని పేరు. అయితే అదంతా చరిత్రలో కలిసిపోయింది. ఎందుకంటే గాంధి ఫ్యామిలి రాయబరేలి నియోజకవర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. దాంతో ఇతర పార్టీల అభ్యర్ధులు ఇక్కడ జెండాపాతేశారు. తరతరాలుగా కేవలం తమ ఫ్యామిలిని మాత్రమే ఆధరిస్తున్న ఓటర్లను గాంధి ఫ్యామిలి అవమానించిందనే చెప్పాలి. అందుకనే ఓటర్లు కూడా ఈ ఫ్యామిలికి గుణపాఠం చెప్పాలని ఓడగొట్టారు.

 ఇంతకీ విషయం ఏమిటంటే ప్రస్తుత ఎన్నికల్లో రాయబరేలి లోక్ సభ స్ధానం పరిధిలోని ఐదు అసెంబ్లీ స్ధానాల్లో ఒక్కదానిలో కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదు. జనాలందరికీ కాంగ్రెస్ పైన అబిమానమున్నా గాంధీ ఫ్యామిలి కష్టపడి వాళ్ళందరినీ దూరం చేసుకుంది. ఓట్లేయటానికి జనాలు సిద్ధంగా ఉన్నా మీరెవరు మాకు ఓట్లేయటానికి అన్నట్లుగా వ్యవహరించింది ఫ్యామిలి. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ వైభవం ఈ నియోజకవర్గంలో చరిత్రలో కలిసిపోయింది.

 2004-2014 మధ్యలో కాంగ్రెస్సే అధికారంలో ఉన్న కనీస సౌకర్యాలను కూడా కల్పించలేదట. ఎంతమంది నేతలు వెళ్ళి జనాల అవసరాలను, అసంతృప్తిని సోనియా, రాహూల్, ప్రియాంకగాంధీలకు చెప్పినా ఎవరు పట్టించుకోలేదట. అందుకనే ఇక్కడ నుండి జనాలు వాళ్ళని వెళ్ళిగొట్టేసినట్లు చెబుతున్నారు. తాజా ఎన్నికల్లో ఒక్కసారి కూడా రాహూల్, ప్రియాంకలు కనీసం ప్రచారానికి కూడా వెళ్ళలేదట. దీంతోనే గాంధి కుటుంబం రాయబరేలిని వదిలేసిందని అర్ధమవుతోంది.

 గాంధి ఫ్యామిలి అంటే అపారమైన అభిమానం ఉన్న కుటుంబాలు ఇప్పటికే వేలల్లో ఉన్నాయట. ఎన్నికల్లో మంచి ఫిలతాలు సాధించాలని కొన్ని నెలలుగా కష్టపడుతున్న ప్రియాంకగాంధి మరి రాయబరేలి లోక్ సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలను ఎందుకు టచ్ చేయలేదో ఎవరికీ అర్ధం కావటంలేదు. ఒకసారి ప్రియాంక ప్రచారానికి వస్తే చాలు ఓట్లేద్దామని అనుకున్న జనాలు తీవ్ర నిరాసచెందారట. దాంతో తప్పనిసరిగా ఇతర పార్టీలకు ఓట్లేయాల్సొచ్చిందని చాలామంది చెబుతున్నారు. గ్రండ్ లెవల్ నుండి అందుతున్న సమాచారం చూస్తుంటే గాంధి ఫ్యామిలియే రాయబరేలి అవసరం లేదని తీర్మానించుకున్నట్లే కనబడుతోంది.

    
    
    

Tags:    

Similar News