ఆ బలం తోనే రష్యాను ఉక్రెయిన్ కట్టడి చేయగలిగిందా?

Update: 2022-03-09 11:07 GMT
నాటోలో చేరాలని ఉక్రెయిన్ ప్రయత్నాలు ప్రారంభించిన నాటి నుంచి ఆ దేశాన్ని తమ అధీనంలోకి తీసుకోవాలని రష్యా భావించింది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ పై సైనిక చర్యను ప్రారంభించింది. అయితే అమెరికా లాంటి దేశాలతో పాటు గా సమానమైన ఆయుధ సామాగ్రి ఉన్న దేశంగా రష్యా ఉంది. ఈ నేపథ్యంలోనే చిన్న దేశమైన ఉక్రెయిన్ లో రష్యా జెండా పాతాలి అనుకుంటే గట్టిగా కొన్ని గంటల వ్యవధి సరిపోతుందని అందరూ అనుకున్నారు.

కానీ అందుకు భిన్నంగా రష్యా సేనలను ఉక్రెయిన్ సైనికులు గట్టిగా తిప్పి కొడుతున్నారు. నాటో దేశాల మద్దతు లేకపోయినా సరే.. తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. దీనికి గల కారణాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
 
ఉక్రెయిన్.. రష్యా దురాక్రమణను ముందుగానే ఊహించింది. అందుకే క్రిమియాను ఆక్రమించుకున్నప్పటి నుంచే యుద్ధ తంత్రాలను నేర్చుకోవడం ప్రారంభించింది. ఏదో ఒక రోజు ఇది జరుగుతుందని భావించి సైనికులకు తీవ్రమైన శిక్షణ ఇప్పించింది. కొంత మందిని ఏకంగా నాటో సైనికుల నుంచి కూడా రప్పించింది. అంతే గాకుండా ఆయుధాలను కూడా భారీగా కొనుగోలు చేసింది.

ప్రతి ఏటా బడ్జెట్ లో భారీగా రక్షణ శాఖకు నిధులు కేటాయించింది. మరో విషయం ఏమిటి అంటే.. ఉక్రెయిన్ కు స్థాన బలిమి కూడా కలిసి వచ్చింది. దీనిని ముందుగా ఊహించలేక పోయింది రష్యా. అందుకే ఇప్పటికీ కీలకమైన నగరాలను తమ అధీనంలోకి తెచ్చుకోవాలి అంటే ఇబ్బంది పడుతుంది. అంతే కాకుండా ప్రజల నుంచి ఈ స్థాయిలో తిరుగు బాటు ఉంటుందని రష్యా కూడా ఊహించలేక పోయింది.

అధ్యక్షుడు ముందుండి నడపడంతోనే ఇది సాధ్యమైందని విశ్లేషకులు అంటున్నారు. ఉక్రెయిన్ ప్రజలను లక్ష్యంగా చేసుకుని రష్యా చేసిన దాడులతో ఆ దేశ ప్రజల్లో మరింత అసహనం పెరిగింది. దీంతో చాలా మంది స్వచ్ఛందంగా సైన్యంలో చేరారు. ఇదే సంఘీభావం రష్యా పై వ్యతిరేకత గా మారింది. దీంతో పుతిన్ సేనకు ప్రతి ఘటన ఎక్కువ అయ్యింది. ముఖ్యంగా నివాసాలపై, ఆసుపత్రులు, స్కూల్స్ పై చేసిన దాడులు తీవ్రమైన ప్రభావాన్ని చూపాయి.

అంతర్జాతీయంగా ఉక్రెయిన్ కు మంచి మద్దతు లభించింది. నాటో దేశం కానప్పటికీ ఆ దేశాలు నుంచి ఆశించినంత లేకపోయినా ఆయుధాల పరంగా ఎక్కడ లోటు లేకుండా చూశాయి. ఇది ఉక్రెయిన్ కు ప్లస్ గా మారింది. విలువైన యుద్ధ ట్యాంకులు, మిసైల్స్, ఇతర ఆయుధాలు విదేశాల నుంచి భారీగానే అందాయి. దీనితోనే ఉక్రెయిన్ రష్యాను కట్టడి చేయగలిగిందని విశ్లేషకులు చెబుతున్నారు
Tags:    

Similar News