ప‌న్నెండేళ్ల వైసీపీ : చెప్పిన‌వ‌న్నీ చేశారా ?

Update: 2022-03-12 11:30 GMT
ఎవ్వ‌రూ అనుకోలేదు..జ‌గ‌న్ ఇంత‌టి స్థాయిలో రాజ్యాధికారం ద‌క్కించుకుంటారు అని! ఎవ్వ‌రూ ఊహించ‌లేదు జిల్లా కాంగ్రెస్ కార్యాల‌యాలు ఇవాళ కనీస స్థాయిలో కూడా కార్య‌క‌లాపాలు నిర్వ‌హించ‌లేని దుఃస్థితిలో ఉంటాయి అని! ఏం జ‌రిగినా అదంతా పై వాడి ద‌య. ఆ విధంగా ఆ రోజు సోనియా అనే అధినేత్రి జ‌గ‌న్ ను నిలువ‌రిస్తే, జ‌గ‌న్ అనే యువ నాయ‌కుడు కాంగ్రెస్ కు చుక్కలు చూపించారు.ఆ విధంగా జ‌గ‌న్ స‌క్సెస్.ఓ నాయ‌కుడిగా స‌క్సెస్ కానీ పాల‌కుడిగా..?

జ‌గ‌న్ మొద‌ట్లో చెప్పిన విధంగానే పార్టీని న‌డుపుతున్నారు.కొత్త వారికి అవ‌కాశాలు ఇవ్వ‌డంలో ముందున్నా, విమ‌ర్శ‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌డం లేదు అన్న‌ది ఓ వాస్త‌వం.అదేవిధంగా జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు ఇప్ప‌టిదాకా ముఖ్య‌మంత్రి రాక‌పోవ‌డంతో క్షేత్ర స్థాయిలో పాల‌నపై ఏ అభిప్రాయం ఉందో కూడా తెలియ‌ని స్థితిలో ఇవాళ వైసీపీ అధినాయ‌క‌త్వం ఉంది.ఆ విధంగా కాకుండా ముఖ్య‌మంత్రి జిల్లాల ప‌ర్య‌ట‌న చేప‌డితే ప్ర‌జ‌ల్లో క్రేజ్ రావ‌డ‌మే కాదు జ‌గ‌న్ పై న‌మ్మ‌కం కూడా పెరుగుతుంది.

కరోనా ఉద్ధృతంగా ఉన్న‌వేళ‌ల్లో కూడా జ‌నం మ‌ధ్య‌కు వ‌చ్చి పిన‌ర‌యి విజ‌య‌న్ (కేర‌ళ ముఖ్య‌మంత్రి) వ‌చ్చి ప‌నిచేశారు. కేజ్రీవాల్ (ఆప్ అధినేత,ఢిల్లీ ముఖ్య‌మంత్రి) వ‌చ్చి ప‌నిచేశారు.పొరుగున స్టాలిన్ అయితే నేరుగా జ‌నం మ‌ధ్య‌లో ఉంటూ వారికి కావాల్సిన‌వ‌న్నీ అందేలా చూశారు.కానీ జ‌గ‌న్ ఆ రోజు బ‌య‌ట‌కు రాలేదు. కేసీఆర్ కూడా రాలేదు.

కేటీఆర్ మాత్రం క్షేత్ర స్థాయిలో తిరిగి తండ్రిప‌రువు కాపాడారు. ట్విట‌ర్ వేదిక‌గా కూడా జ‌గ‌న్ పెద్ద‌గా ఆ వేళ స్పందించిన దాఖ‌లాలే లేవు. అదే విమ‌ర్శ ఇప్పుడు ఆయ‌న‌పై బ‌లీయంగా ఉంటోంది.దాని ప్ర‌భావం రేప‌టి వేళ స్ప‌ష్టంగా క‌న‌బ‌డ‌నుంది కూడా అని ప‌రిశీల‌కులు అంటున్నారు.

ఆఖ‌రుగా చెప్పిందే చేస్తాం చేసేదే చెబుతాం అని ఆ రోజు ప్ర‌సంగాల్లో విప‌రీతంగా చెప్పిన మాట ఇది. కానీ అధికారంలోకి వ‌చ్చాక ఆయ‌న‌పై ఉన్న అంచనాలు మ‌రియు ఇదే స‌మ‌యంలో ఆయ‌న అంచ‌నాలు కూడా త‌ల్ల‌కిందుల‌య్యాయి.క‌రోనా త‌రువాత రాష్ట్రం కోలుకున్నా కూడా కొన్ని రంగాల‌కు జ‌గ‌న్ ఇవ్వాల్సిన చేయూత ఇవాళ్టికీ ఇవ్వ‌డం లేదు.

చెప్పిందే చేస్తాం అన్న‌మాట ఎప్పుడో చ‌రిత్ర‌లో ఉండిపోయింది. అందుకు ఆర్థిక రంగంలో ఆశించిన ప్ర‌గ‌తి లేక‌పోవ‌డ‌మే! చేసేదే చెప్తాం.. అవును! ఆ విధంగా చెప్పిన కూడా వాటిలో చాలా వాస్త‌వ దూరాలే! వీటిని దిద్దుకుంటే చాలు..దిద్దుకునేందుకు చ‌ర్య‌లు తీసుకుంటే ఇంకా మేలు.
Tags:    

Similar News