జిల్లాలకు వచ్చేందుకు ఇంతవరకూ జగన్ సమయం కేటాయించ లేదన్న వాదన ఒకటి ఉంది.అంతేకాదు ఆ విధంగా ఆయన తన విలువైన సమయాన్ని ప్రణాళికాయుతంగావాడుకోలేదు అని కూడా విమర్శ ఉంది. అయితే ఆయన కనుక జిల్లాలకు వస్తే చాలా విషయాలు ఇప్పటి కన్నా బాగా తెలుస్తాయి. జిల్లాలకు వచ్చాక కార్యకర్తలతోభేటీ అయి ఉంటే ఇంకాస్త నిజానిజాలు తెలుస్తాయి.
శ్రీకాకుళం లాంటి మారుమూల ప్రాంతాలలో సమస్యలు తెలుసుకుని వీలున్నంత మేరకు వాటి పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తే సత్ఫలితాలు ఇస్తాయి. కొత్త జిల్లాలు ఏర్పాటు అయ్యాక జగన్ ఇటుగా రావాలని కోరుకోవడం తప్పేం కాకపోయినా ఆ దిశగా జగన్ ఆలోచించకపోతే మాత్రం పాలనకే ప్రమాదం.
ఈ దశలో కార్యకర్తలతో సమావేశం అయ్యేందుకు సమాయత్తం అవుతున్నారు జగన్.రేపటి నుంచి రెండు రోజుల పాటు ఇందుకోసమే తన విలువైన సమాయాన్ని అంతా వెచ్చించనున్నారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ భేటీ ఉంటుందని తెలుస్తోంది.ఇంతవరకూ బాగానే ఉన్నా ఎమ్మెల్యేలకు చెప్పిన విధంగా మంత్రులకు చెప్పిన విధంగా కార్యకర్తలకు తీవ్ర స్థాయి స్వరంతో ఏమయినా జగన్ చెప్పగలరా అన్నదే పెద్ద సందేహం.
ఎందుకంటే జగన్ చెప్పినా చెప్పకున్నా ఇవాళ కార్యకర్తలు ఎవరి పని వారు చేసుకుని వెళ్తున్న వారే ఎక్కువ.కొందరే తగాదాలకు ప్రాధాన్యం ఇస్తూ వెళ్తున్నారు.నిజాయితీగా మాట్లాడుకుంటే కార్యకర్తలకు పార్టీ చేసిన సేవ ఎంతో గొప్పది కానీ వాళ్లు పార్టీ నుంచి పొందిందేం లేదు.అంతేకాదు అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేలు చాలా మంది వాళ్లను వాడుకుని వదిలేశారు. వలంటీరు ఉద్యోగానికి కూడా రికమెండ్ చేయని ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.ఈ దశలో జగన్ వాళ్లకు ఏ విధంగా దిశా నిర్దేశం చేస్తారు అన్నది ఓ పెద్ద సంశయం.
ఇదే దశలో జిల్లాలకు ఒక్కసారి కూడా జగన్ రాలేదు.ఇంతవరకూ జిల్లాల పర్యటనకు సంబంధించిన ఊసే లేదు.క్షేత్ర స్థాయిలో పార్టీ ఎలా ఉందో ఏం నడుస్తుందో అన్నది కూడా తెలియడం లేదు ఇవాళ సీఎంకు! కనుక జగన్ చేయాల్సింది చేపట్టాల్సింది జిల్లాల పర్యటనే ! కరోనా మూడు ఫేజుల్లోనూ ముఖ్యమంత్రి బయటకు రాలేదు.ఇక శ్రీకాకుళం లాంటి మారుమూల ప్రాంతాల్లో మంత్రులు కూడా పెద్దగా పనిచేసి సాధించిన ఫలితాలేవీ లేవు.
ఈ దశలో శ్రీకాకుళం లాంటి మారుమూల ప్రాంతాల్లో అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. నిధులు లేక నిలిచిన పనులపై సీఎం దృష్టి సారిస్తే పార్టీ కన్నా ముందు ప్రభుత్వం బాగుపడుతుంది. ప్రభుత్వం బాగుపడితే పార్టీ దానంతట అదే బాగు పడడం మంచి ఫలితాలు అందుకోవడం ఖాయం.