హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల తాజా అప్డేట్ ఇది

Update: 2021-03-20 07:46 GMT
పోలింగ్ పూర్తి అయి.. కాస్త గ్యాప్ తర్వాత ఓట్ల లెక్కింపు మామూలే. ఇప్పటివరకు ఎప్పుడూ లేని రీతిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపు రికార్డుస్థాయిలో నాలుగో రోజు సాగుతోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ రాత్రికి తుది ఫలితం వెలువడుతుందని.. లేదంటే ఆదివారం ఉదయం వరకు సాగినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు అయితే.. అలాంటి పరిస్థితి దాదాపు ఉండదని.. ఈ రాత్రికి పూర్తి అయ్యే అవకాశాలే ఎక్కువన్న మాట అధికారులు నోట వినిపిస్తోంది.

93 మంది అభ్యర్థులతో జరిగిన హైదరాబాద్.. రంగారెడ్డి.. మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల ఉప ఎన్నికల్లో అందరూ ఆశించినట్లే టీఆర్ఎస్.. బీజేపీ మధ్యే సాగుతోంది. ఈ ఎన్నికను టీఆర్ఎస్ అధినేత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటం తెలిసిందే. ఓట్ల లెక్కింపు మొదలైన నాలుగు రోజులకు (శనివారం) తాజాగా బరిలో ఉన్న 89 మంది అభ్యర్థుల్ని ఎలిమినేట్ చేశారు అధికారులు. వారికి వచ్చిన ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కించి.. వాటిని ఆయా అభ్యర్థుల ఖాతాలకు వేశారు. దీంతో ఇప్పుడు బరిలో మరో నలుగురు మాత్రమే మిగిలారు.

వారిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిన్నారెడ్డి.. స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్.. బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు.. టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి ఉన్నారు. 89 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ తర్వాత ఆఖర్లో నిలిచిన నలుగురు అభ్యర్థులకు ఎన్నెన్ని ఓట్లు వచ్చాయంటే.. టీఆర్ఎస్ కు అధిక ఓట్లు వస్తే.. రెండో స్థానంలో నాగేశ్వర్ నిలిచారు. మొత్తం ఓట్లలో మూడో స్థానంలో ఉన్న ఆయన.. 89 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ సందర్భంగా వారికి పడిన రెండో ప్రాధాన్యత ఓట్లుఆయనకే ఎక్కువగా పడ్డాయి. బీజేపీ మూడో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ నాలుగో స్థానానికి పరిమితమైంది.
టీఆర్ఎస్   6930
బీజేపీ         5832
నాగేశ్వర్     6038
కాంగ్రెస్        5172

89 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ తర్వాత ఇప్పుడు జాబితాలో తక్కువగా ఓట్లు ఉన్న చిన్నారెడ్డికి పడిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి ఎక్కువగా ఉన్నాయన్న విషయాన్ని అధికారులు తేల్చనున్నారు. ఆయనకు మొత్తం 36726 ఓట్లు పడ్డాయి. వాటిల్లోరెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికో తేలుస్తారు. అప్పుడు ముగ్గురు అభ్యర్థులు నిలుస్తారు. మూడో స్థానంలో ఉన్న నాగేశ్వర్ కుపడిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లు వేయటంతో తుది ఫలితం తేలే పరిస్థితి. ఇక.. 89 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ వేళకు.. తుది ఓట్ల లెక్కింపులో నిలిచిన అభ్యర్థుల్లో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయన్నది చూస్తే..
టీఆర్ఎస్        1,19,619
బీజేపీ             1,10,500
నాగేశ్వర్            59,648
కాంగ్రెస్               36,726
Tags:    

Similar News