ఉక్రెయిన్ యతాతథ స్థితికి రావడానికి పదేళ్లు పడుతుందా?

Update: 2022-03-21 00:30 GMT
ఉక్రెయిన్ పై యుద్ధంలో రష్యా రూటు మార్చుకున్నట్లే అనిపిస్తోంది. గడచిన 25 రోజుల యుద్ధంలో దేశంలోని అన్ని నగరాలు, పట్టణాలపైన రష్యా సైనికులు విరుచుకుపడ్డారు. దాంతో పెద్దగా ఉపయోగం లేదని తేలిపోయింది.

అందుకనే రూటు మార్చుకుని కేవలం ప్రధాన నగరాలపైన మాత్రమే దాడులు చేయాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించారు. దాని ప్రకారం రాజధాని కీవ్, లెవివ్, ఖర్కీవ్, మారియాపోల్, క్రామాటోర్ స్క్ పైనే దాడులు ఎక్కువ చేశారు.

రాజధాని కీవ్ తో పాటు పైన చెప్పిన నగరాలపైన రష్యా వైమానిక దళాలు విపరీతంగా బాంబులతో విరుచుకుపడ్డాయి. లెవివ్ పై జరిగిన బాంబు దాడుల కారణంగా కొన్ని గంటల పాటు నగరమంతా పొగలు కమ్ముకునేశాయి.

దీంతో ఏమి జరుగుతోందో అర్ధంకాక జనాలు గంటలపాటు నానా అవస్థలు పడ్డారు. బాంబులతో విరుచుకుపడుతున్న రష్యా దళాలు ఆఫీసులు, ఆసుపత్రులు, జనావాసాలన్న తేడాలేకుండా పోయింది.

రష్యా తాజా వ్యూహం ప్రకారం ఎంతమంది చనిపోయారు ? ఎంత మంది తీవ్రంగా గాయపడ్డారనే విషయంలో ఎవరికీ క్లారిటీ రావటంలేదు. పైన చెప్పిన నగరాల్లో ఎక్కడ చూసినా మృతదేహాలు, గాయాలతో కొట్టుకుంటున్న జనాలు, ధ్వంసమైపోయిన భవనాలే కనబడుతున్నాయి. మొత్తం మీద తాజా యుద్ధం ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఉక్రెయిన్ పుంజుకోవాలంటే కనీసం ఓ పది సంవత్సరాలు పడుతుందని ప్రభుత్వవర్గాలు అంచనా వేస్తున్నాయి.

అది కూడా యావత్ ప్రపంచం తలా ఓ చేయివేస్తేనే. ఇప్పుడు ఆయుధాలను సప్లై చేస్తున్న అమెరికా నాటో దేశాలు రేపు యుద్ధం ఆగిపోయిన తర్వాత పునర్నిర్మాణానికి వేల కోట్ల రూపాయల నిధులివ్వాల్సిందే. ఐక్యరాజ్యసమితితో పాటు అన్నీ దేశాలు ఆదుకోకపోతే ఉక్రెయిన్ సంగతి అంతే సంగతులు.
Tags:    

Similar News