ఫిట్ గా ఉంటే గుండెపోటు రాదా?.. ఛాన్స్ ఎంత వరకు?

Update: 2022-03-05 11:12 GMT
ఇటీవల కాలంలో గుండె పోటుతో మరణించే వారి సంఖ్య పెరుగుతోంది. ఆరోగ్యకరమైన అలవాట్లు ఉన్నవారు సైతం ఈ ప్రమాదానికి గురవుతున్నారు. అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ వచ్చి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందుకు ఉదాహరణ సిద్దార్థ్ శుక్లా, ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి, ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్. నిజానికి వీరందరి శరీరం ఫిట్ గా ఉంటాయి. వీళ్లంతా కూడా 50 ఏళ్ల వారే. అంతే కాకుండా జిమ్ లో భారీ వ్యాయామాలు చేస్తుంటారు. అయినా కూడా గుండె పోటుతో అతి తక్కువ వయసులోనే కన్నుమూశారు. అయితే ఫిట్ గా ఉన్నా కూడా గుండెపోటు వస్తుందా? నిపుణులు ఏం అంటున్నారు..?

గుండె పోటు అంటే ఒకప్పుడు అరవై ఏళ్ల తర్వాత వస్తుండేది. వాస్తవానికి దీనిని వృద్ధాప్య వ్యాధి గా పిలుస్తుంటారు. కానీ ఇటీవల ఈ సమస్య పెరిగింది. హార్ట్ ఎటాక్ తో చిన్న వయసువారు కూడా మరణిస్తున్నారు. 40 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వారు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఫిట్ గా ఉంటే గుండెపోటు రాదని భావించేవారు. కానీ శరీరం లోపల జరిగే క్రియలు బయటకు తెలియకపోవచ్చు. అంతా ఆరోగ్యకరంగానే అనిపిస్తున్నా.. లోపల ఏమైనా సమస్యలు ఉండవచ్చు. అవి బయటకు తెలియకపోవడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

గుండెకు రక్త ప్రసరణ ఆగిపోయినప్పుడు హార్ట్ ఎటాక్ వస్తుంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల... కూడా ఈ ప్రమాదం కలుగుతుంది. రక్త నాళాల్లో ఏదైనా అడ్డు తగిలినప్పుడు హార్ట్ ఎటాక్ సంభవించే ప్రమాదం ఉంది.  గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్ అనేవి వాస్తవానికి రెండు వేర్వేరు ప్రమాదాలు. ఇవి దగ్గరగా ఉన్నా వీటికి వేర్వేరు కారణాలు ఉంటాయి. వైద్యపరంగా వీటి నిర్ధారణ కూడా వేర్వేరుగా ఉంటుంది. చికిత్సలు కూడా వేర్వేరుగా ఉంటాయి. అయితే వీటికి మానసిక ఒత్తిడి కూడా ప్రధాన కారణం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది అధిక రక్తపోటును పెంచుతుంది. చివరకు ప్రాణంతంగా మారుతుంది.

అయితే గుండె పోటు రావడానికి శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. వాటిని గమనించుకుంటే కొంతమేర ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చునని అంటున్నారు. కొందరిలో ఇలాంటి మార్పులు కనిపించకపోవచ్చును అని కూడా చెబుతున్నారు.

శరీరం ఎడమ వైపున బిగుతుగా మారుతుందని... ఛాతి, చేయి, మెడ నొప్పి వస్తుందని తెలిపారు. వికారం, అజీర్ణం, తరుచూ వేడి, కడుపు నొప్పి, శ్వాస ఆడకపోవడం, చెమటలు పట్టడం, అలసట, ఆకస్మిక మైకం వంటి సమస్యలు ముందుగా వస్తాయని అంటున్నారు. ఇలాంటివి ఉంటే ఒకసారి వైద్యులను సంప్రదించడం ఉత్తమం అని సూచిస్తున్నారు.

ఫిట్ గా ఉన్నా కూడా గుండె నొప్పి వస్తోంది. శరీరానికి తగిన వ్యాయామాలు మాత్రమే చేయాలని వైద్యులు చెబుతున్నారు. అత్యధిక ఒత్తిడితే.... ఎక్కువ కష్టపడడం ఏమాత్రం శ్రేయస్కారం కాదంటున్నారు. మరోవైపు ఆరోగ్యకరమైన అలవాట్లు, మంచి డైట్ ఫాలో కావాలని చెబుతున్నారు. శరీరంలో ఏదైనా తేడాగా అనిపిస్తే వైద్యులను సంప్రదించాలని... సొంత వైద్యం పనికిరాదని చెబుతున్నారు. అయితే గుండెపోటు రావడానికి ముందు వచ్చే లక్షణాలు ఇవే అని ప్రత్యేకంగా చెప్పలేమని వైద్యనిపుణులు పేర్కొన్నారు.
Tags:    

Similar News