మల్లారెడ్డి బుక్కయ్యాడు.. మేం కామంటున్న టీఆర్ఎస్ నేతలు

Update: 2022-11-27 13:30 GMT
కేంద్ర ద్యాప్తు సంస్థల దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న టీఆర్ఎస్ లో ఇప్పుడు మల్లారెడ్డి తర్వాత ఎవరు అంటూ చర్చ సాగుతోంది. కేసీఆర్ ఇచ్చిన ధైర్యంతో మల్లారెడ్డి చెలరేగిపోయారు. కానీ కేసుల పాలయ్యారు. కేంద్ర సంస్థలు మాత్రం వదిలేలా కనిపించడం లేదు.

రాజకీయ ఒత్తిడితో సోదాలు చేసినా వారి పని వారు చేసుకెళతారు కానీ తప్పుడు లెక్కలు, సాక్ష్యాలతో ఇరికించరు. కానీ మల్లారెడ్డి మాత్రం కేసీఆర్ చెప్పారని వారిపై ఆరోపణలు చేశారు. కొట్టారన్నారు. కేసులు పెట్టారు.

కానీ ఇదే మల్లారెడ్డిని తీవ్రంగా దెబ్బతీసిందని.. ఆయన మరింతగా కూరుకుపోతారని అంటున్నారు. ఆయన విద్యాసంస్థలకు గండం పొంచి ఉందని ప్రచారం సాగుతోంది. మల్లారెడ్డిలాగే తాము చేస్తే ఇరుక్కుపోతామని టీఆర్ఎస్ నేతలు సైలెంట్గా ఉంటున్నారు.

గంగుల కమలాకర్ ఇంటిపై ఈడీ దాడులు చేసినా ఆయన నోరుజారలేదు. ఆయన ఇంటి తాళాలు పగులకొడితే తానే పగులకొట్టామని చెప్పానని కవర్ చేశారు. ఈడీ అధికారులపై ఒక్క మాట మాట్లాడలేదు. దర్యాప్తునకు సహకరిస్తానన్నారు.

ఇతరలూ అంతే.. ఐటీ, ఈడీ అధికారులపై తిరగబడితే ట్రైయిన్ రివర్స్ అవుతుందని అందరికీ తెలుసు. కానీ మల్లారెడ్డి మాత్రం తొడకొట్టాడు. దీంతో ఆయనను మరింతగా టార్గెట్ చేశారు. కేసీఆర్ మా వెనుక ఉన్నారని.. ఆయన మాటే శిరోధార్యమని భావించిన నేతలు ఇప్పుడు మల్లారెడ్డి ఎపిసోడ్ చూసి భయపడిపోతున్నారు.

కేంద్రదర్యాప్తు సంస్థలతో పెట్టుకుంటే మొదటికే మోసం వస్తుందని.. సీఎం కేసీఆర్ మాటలు విని రెచ్చిపోతే అనవసరంగా ఖంగుతినడం ఖాయమని అంటున్నారు. గులాబీ నేతలు ఇప్పుడు ఐటీ, ఈడీ దాడులు జరిగినా ఈ ఇస్యూను పెద్దగా తీసుకోవద్దని.. చెలరేగిపోవద్దని భావిస్తున్నారు.
Tags:    

Similar News