క‌క్కలేక‌.. మింగ‌లేక‌.. ఔట్ సోర్సింగ్‌పై స‌ర్కారు ఫీట్లు

Update: 2022-12-06 04:30 GMT
ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం ఆర్థిక స‌మ‌స్య‌ల్లో ఉంది. ఉద్యోగుల‌కు జీతాలు, భ‌త్యాల‌ను కూడా స‌కాలంలో చెల్లించ‌లేక ఇబ్బందులు ప‌డుతోంది. ఈ క్ర‌మంలోనే అప్పుల కుప్ప‌లు  పెరిగిపోయాయి. మ‌రోవైపు కొత్త‌గా తీసుకువ‌చ్చిన వ‌లంటీర్ , స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌ల ద్వారా కూడా చేతి చ‌మురు బాగానే వ‌దులుతోంది.

దీంతో ఉన్న‌భారాన్ని త‌గ్గించుకునే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం అయ్యాయి. రాష్ట్రంలో టీచ‌ర్ పోస్టులు ఖాళీగా ఉన్న‌ప్ప‌టికీ..  ఉన్న‌వారినే `విలీనం` పేరుతో స‌ర్దుబాటు చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు కొత్త‌గా డీఎస్సీ వేసిన పాపాన పోలేదు.

అదేవిదంగా ఏటా జ‌న‌వ‌రిలో క్యాలెండ‌ర్ ప్ర‌క‌టించి ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తామ‌న్న హామీ కూడా అట‌కెక్కించారు. ఈ నేప‌థ్యంలో స‌ర్కారు ప‌దేళ్లు పూర్తి చేసుకోని ఔట్ సోర్సింగ్ సిబ్బందిని అన్ని విభాగాల నుంచి ఇంటికి పంపిచేస్తే.. ఏగొడ‌వా ఉండ‌ద‌ని భావించింది.

ఇక్క‌డ మ‌రో విష‌యం కూడా ఈ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అంద‌రూ కూడా.. టీడీపీ హ‌యాంలోనే నియ‌మితులైన వారు కావ‌డం గ‌మ‌నార్హం. ఎందుకంటే.. వీరు త‌మ ప్ర‌బుత్వానికి వ్య‌తిరేకంగా ప‌నిచేస్తార‌నే ఆలోచ‌న స‌ర్కారుకు ఉంది. ఈ నేప‌థ్యం కూడా తొల‌గింపు వెనుక కార‌ణంగా ఉంద‌ని తెలుస్తోంది.

మొత్తానికి ఔట్ సోర్సింగ్‌లో ప‌నిచేస్తున్న దాదాపు 2.5 ల‌క్షల మందిని ఇంటికి పంపేయాల‌ని జీవో కూడా ఇచ్చేశారు. కానీ, దీనిపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఎన్నిక‌ల ముంగిట‌.. ఏం జ‌రుగుతుందో అని భ‌య‌ప‌డుతున్న ప్ర‌భుత్వం దీనిని వెన‌క్కి తీసుకోలేక‌.. అలాగని ధైర్యంగా ముందుకు సాగ‌లేక నానా తిప్పలు ప‌డుతోంది.

ఈ క్ర‌మంలోనే తెర‌మీదికి వ‌చ్చిన మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ కానీ, స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కానీ, స‌ద‌రు తీసివేత‌ల‌ను కూడిక‌ల‌తో క‌లిపే ప్ర‌య‌త్నం చేశారు.
Tags:    

Similar News