న‌వ్వుతోనూ వైర‌స్ నివార‌ణ: ‌రోగుల‌కు కొత్త ప్ర‌యోగం

Update: 2020-05-21 02:30 GMT
భార‌త‌దేశంలో మ‌హ‌మ్మారి వైరస్ విజృంభ‌ణ ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. గ‌తంలో ఎప్పుడు లేన‌ట్టు కొత్తగా బుధ‌వారం రికార్డు స్థాయిలో 5,611 పాజిటివ్ కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. దీంతో దేశంలో వైర‌స్ వ్యాప్తి నిరాటంకంగా కొన‌సాగుతోంది. పెద్ద‌సంఖ్య‌లో వైర‌స్ బారిన ప‌డుతున్న వారికి ఆస్ప‌త్రుల్లో వైద్యం అందిస్తున్నారు. అయితే బాధితుల‌కు నివార‌ణ చేసేందుకు కొన్ని ప్ర‌యోగాత్మ‌కంగా వైద్య విధానంలో చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే ప్లాస్మాథెర‌పీ వ‌చ్చింది. ఇప్పుడు న‌వ్వుల‌తోనూ ఆ వైర‌స్‌ను త‌గ్గించ‌వ‌చ్చ‌ని వైద్యులు భావించి ప్ర‌యోగాత్మ‌కంగా ముంబైలో ప్ర‌య‌త్నించారు.

దేశంలో అత్య‌ధికంగా మ‌హారాష్ట్రం భారీ స్థాయిలో కేసులు న‌మోద‌వుతున్నాయి. మరి ముఖ్యంగా ముంబయిలో ఆ వైర‌స్ విజృంభ‌ణ తీవ్ర‌స్థాయిలో ఉంది. ఆ వైర‌స్ బారిన‌ప‌డిన రోగుల‌కు కొత్త త‌ర‌హాలో వైద్యం అందించాల‌ని వైద్యులు నిర్ణ‌యించారు. ఈ సంద‌ర్భంగా రోగుల్లో ఆత్మ‌స్థైర్యం నింపేలా, వారిలో భ‌యాందోళ‌న తొలిగేలా వైద్యులు సరికొత్త విధానం మొద‌లుపెట్టారు. రోగులు ఆనందంగా ఉండేలా లాఫింగ్‌ థెరపీని ప్రయోగించ‌డం షురూ చేశారు. ముంబైలోని దాదర్స్‌ శిల్వ స్కూల్‌లో క‌రోనా బాధితుల కోసం ఆస్ప‌త్రిగా రూపొందించారు. దీనిలో ఈ వినూత్న ప్రయోగం చేశారు. బెడ్లపైన ఉన్న పాజిటివ్‌ బాధితులతో చప్పట్లు కొట్టి ఉత్సాహం నింపే ప్ర‌య‌త్నం చేశారు. కాసేపు ఆనందంగా నవ్వుకోవడంతో పాటు ఉల్లాసంగా ఉండేలా కబుర్లు చెబుతున్నారు. ఆ వైర‌స్‌తో భయపడాల్సిన పనిలేదని రోగుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ కొత్త విధానం ఆ వైర‌స్ బాధితులు త్వ‌ర‌గా కోలుకునేందుకు దోహ‌దం చేస్తుంద‌ని ప‌లువురు చెబుతున్నారు. ఈ లాఫింగ్‌ థెరపిపై అంద‌రూ హ‌ర్షం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News