భారతీయ టెకీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ మరో దుర్వార్తతో తెరమీదకు వచ్చింది. అమెరికాలో ఉద్యోగులను పెద్ద ఎత్తున తీసుకోవాలనే ఆలోచనలో ఉన్న ఇన్పీకి అదే దేశానికి చెందిన కార్యాకలాపాల్లో గట్టి సవాల్ ఎదురైంది. సంస్థలో ఉద్యోగులపై వివక్ష ఎదురవుతోందనే ఆరోపణల్లో కొత్త కోణం తెరమీదకు వచ్చింది. ఈ మేరకు అమెరికాలో ఓ ఉద్యోగి నష్టపరిహారం కేసు వేశారు. ఇన్ఫోసిస్ సంస్థలో దక్షిణాసియాయేతర ఉద్యోగుల పట్ల వివక్ష చూపుతున్నరాని మాజీ ఉద్యోగి ఒకరు కేసు నమోదు చేశాడు. గతంలో ఇన్ఫోసిస్ సంస్థలోనే ఇమ్మిగ్రేషన్ అధిపతిగా ఉన్న ఎర్విన్ గ్రీన్ ఈ కేసును ఫైల్ చేశాడు.
అమెరికాలోని టెక్సాస్ లో ఉన్న జిల్లా కోర్టులో ఈనెల 19న అతను ఈ కేసును నమోదు చేశాడు. కంపెనీలో సీనియర్లుగా పనిచేస్తున్న గ్లోబల్ ఇమ్మిగ్రేషన్ హెడ్ వాసుదేవ నాయక్ - గ్లోబల్ హెడ్ ఆఫ్ టాలెండ్ అండ్ టెక్నాలజీ బినోద్ హమ్ పాపుర్ లపై ఎర్విన్ గ్రీన్ తన పిటిషన్ లో తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశాడు. దక్షిణాసియా దేశాలకు చెందని ఉద్యోగులపై వివక్ష చూపుతున్నట్లు ఎర్విన్ గతంలో కంపెనీకి ఫిర్యాదులు చేశాడు. దీంతో అతన్ని ఉద్యోగం నుంచి తొలిగించారు. అయితే ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినందు వల్ల తనను తొలిగించినట్లు ఎర్విన్ తన నష్టపరిహారం పిటిషన్ లో పేర్కొన్నాడు. పది వేల అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించనున్నట్లు ఇటీవలే ఇన్ఫోసిస్ ప్రకటన చేసిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం ఆ సంస్థకు పెద్ద ఎదురుదెబ్బ అని పలువురు భావిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/