ఏపీ తెలీనోడు చేసే తప్పు కంటే.. అన్ని తెలిసినోడు చేసే తప్పుతోనే ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. కరోనా నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు వైరస్ వ్యాప్తి ఏ స్థాయిలో ఉంటుంది? రానున్న రోజుల్లో వైరస్ ఎంతమందిని వ్యాప్తించే అవకాశం ఉందన్న అంచనాలు ఊహకుఅందని పరిస్థితి. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నా.. వ్యక్తులుగా చేస్తున్న తప్పులు ఇప్పుడు ప్రజలకు కొత్త ముప్పును తీసుకొస్తున్నాయని చెబుతున్నారు.
నిర్లక్ష్యం.. అవగాహన రాహిత్యం.. ఏం కాదులే అన్న భరోసా.. ఆరోగ్యంగా ఉన్నామన్న భావనతో చేసే తప్పులతో పాటు..అనవసర భయాల్ని మనసులో పెట్టుకొని.. దాన్ని బయటకు పెట్టకుండా చేసే తప్పులకు భారీ మూల్యం చెల్లించాల్సిన అవకాశం ఉంటుందని చెబుతున్నారు. దీనికి చక్కటి ఉదాహరణగా తెలంగాణరాష్ట్ర అధికార పార్టీకి చెందిన సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్పగా చెబుతున్నారు.
అమెరికా నుంచి వచ్చిన ఆయన.. అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలా అని.. ఆయన జాగ్రత్తలు తీసుకోలేదా? అంటే.. తీసుకున్నారు. అమెరికా నుంచి వచ్చిన వెంటనే వైద్యుల్ని కలిసిన ఆయన.. పరీక్షలు చేయించుకున్నారు. అంతా బాగుందన్న మాటతో అందరిని కలవటం షురూ చేశారు. ఆయన మిస్ అయిన పాయింట్ ఏమంటే.. కరోనా వైరస్ ఒంట్లో ఉన్నా.. దాని ప్రభావం ఆయా వ్యక్తులకు ఉండే రోగ నిరోధక శక్తికి తగ్గట్లు.. పది నుంచి పదమూడు రోజుల లోపు ఎప్పుడైనా బయటకు వచ్చే వీలుంది.
ఈ విషయాన్ని ఎమ్మెల్యే కోనప్పకు అర్థమయ్యేలా చెప్పిన జిల్లా కలెక్టర్.. ఆయన్ను వెంటనే స్వీయ క్వారంటైన్ కావాలని కోరారు. దీంతో.. విషయాన్ని అర్థం చేసుకున్న ఆయన.. వెంటనే స్వీయ క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. మరి.. అమెరికా నుంచి వచ్చిన నాటి నుంచి స్వీయ క్వారంటైన్ చేసుకోవటానికి ఉన్న మధ్య కాలంలో ఎమ్మెల్యే కోనప్ప ఎంతమందిని కలిశారు? అన్నదిప్పుడు ప్రశ్న. రానున్న పది.. పదమూడురోజుల్లో అంతా బాగుంటే ఎలాంటి సమస్యా ఉండదు. పొరపాటున ఆయనకు కరోనా పాజిటివ్ అయితేనే ఇబ్బంది అంతా అంటున్నారు.
ఆ మాటకు వస్తే కోనప్ప ఒక్కరే కాదు.. సినిమా షూటింగ్ ల కోసం వివిధ పనుల నిమిత్తం.. విదేశాలకు వెళ్లి వచ్చిన సినీ నటులు.. సినీ రంగానికి చెందిన ఇతరులతో పాటు.. సెలబ్రిటీలు సైతం జాగ్రత్తలు తీసుకోకుండా ప్రజల్లో కలిసి పోతున్నారని చెబుతున్నారు. ఇదే సామాన్యులకుపెద్ద షాక్ గా మారే ప్రమాదం పొంచి ఉందంటున్నారు. పలువురు ప్రముఖులు తమకు ఉండే బిజీ షెడ్యూల్స్ నేపథ్యంలో.. విదేశాల నుంచి వచ్చిన తర్వాత సరైన ఐసోలేషన్ లో లేకుండా బయటకు వస్తున్నారన్న మాట వినిపిస్తోంది.
విదేశాల నుంచి వచ్చినంతనే వైద్యుల్ని కలవటం.. వారు చేసే పరీక్షల్లో ఏమీ లేదన్న మాట ఆధారంగా వారు ఐసోలేషన్ ను వదిలేస్తున్నారన్న మాట వినిపిస్తోంది. ఈ వ్యవహరంలో ఏ చిన్న పొరపాటు దొర్లినా.. భారీ మూల్యం తప్పదంటున్నారు. అయితే.. ఇదంతా భయపెట్టటానికో.. అనవసరమైన ఆందోళనకు గురి చేసేందుకో కాదన్నది మర్చిపోకూడదు. ప్రజల్లో అవగాహనతో పాటు.. ప్రముఖులు.. సెలబ్రిటీలు తమకుతాముగా చేపట్టాల్సిన చర్యల గురించి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్న మంచి ఉద్దేశమే తప్పించి మరొకటి లేదన్నది మర్చిపోకూడదు.