నేతలూ.. వారి ఖరీదైన కార్లూ..

Update: 2020-06-06 23:30 GMT
పుర్రెకో బుద్ది.. మనసుకో ఇష్టం ఉంటుందంటారు. కొందరికి కుక్కలంటే ఇష్టం.. కొందరికి మొక్కలంటే ప్రాణం.. మరికొందరికీ వాహనాలంటే పిచ్చి. ఈ పిచ్చి పీక్స్ లో ఉండే వారున్నారు. తమ ఇంటినిండా కొత్తరకం కార్లు నింపేవారు కోకొల్లలు. అలా మన దేశంలో కొందరు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులకు కార్లంటే పిచ్చి ప్రేమ..   చాలా లగ్జరీ కార్లను కోట్లు ఖర్చు పెట్టి మరీ కొంటుంటారు.

భారత దేశంలో సొంత కార్లు నడుపుతున్న రాజకీయ నాయకులు తక్కువ మంది మాత్రమే ఉన్నారు. అందులో ఎవరెవరు..? ఏఏ కార్లను వాడుతారనేది చూద్దాం..

*పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సినీ హీరోగానే కాదు రాజకీయ పార్టీ అధినేతగా ఎక్కువ అభిమానులను కలిగి ఉన్నారు. ఈయన  ఎక్కువగా మెర్సిడేజ్ బెంజ్ జి-వాగెన్ కారును డ్రైవ్ చేస్తుంటాడు. వాహనాలను నడపడంలో మంచి నైపుణ్యాన్ని పవన్ కలిగి ఉన్నాడు.

*రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీకి కార్లు నడపడం అంటే ఇష్టం. ఆయన తన తల్లి సోనియాగాంధీని కూర్చుండబెట్టుకొని ఢిల్లీ వీధుల్లో తిరుగుతుంటాడు. రాహుల్ ఎక్కువగా టాటా సఫారీలో తిరుగుతుంటాడు.

*చిరంజీవి-రోల్స్ రాయిస్
మెగాస్టార్ చిరంజీవికి రోల్స్ రాయిస్ కార్లు అంటే చాలా ఇష్టం. అత్యంత ఖరీదైన  అరుదైన రోల్స్ రాయిస్ కార్లను చిరంజీవి నడుపుతుంటారు. అమితాబ్ బచ్చన్ కూడా ఇవే కార్లను ఇష్టపడుతుంటారు. దీని ధర ఏకంగా 8 కోట్ల రూపాయల వరకు ఉంటుంది.ఇక రాంచరణ్ తండ్రికి కానుకగా 59వ పుట్టినరోజున టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎస్.యూ.వీని ఇచ్చాడు. ఇది కూడా చిరంజీవి వద్ద ఉంది.

*ఉద్దవ్ ఠాక్రే
మహారాష్ట్ర కోత్త సీఎం ఉద్దవ్ ఠాక్రేకు తన సొంత కారు నడపడం అంటే చాలా ఇష్టం. ఆయన ఎప్పుడూ మెర్సిడేజ్ బెంజ్ ఎస్-క్లాస్ లో ముంబైలో తిరుగుతుంటాడు. ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత కూడా ఆయన డ్రైవ్ చేస్తూ కనిపిస్తున్నాడు.

*ప్రియాంక గాంధీ
సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ కూడా సొంతంగా అన్న రాహుల్ లాగే డ్రైవ్ చేస్తూ ప్రచారంలో వెళుతుంటుంది. ఆమె టాయోటా క్వాలిస్ ను ఎక్కువగా వాడతారు.

*ఒమర్ అబ్దుల్లా:
జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా  చాలా పాత టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎస్.యూవీని కలిగి ఉన్నారు. ఈ కారుని వేరొకరికి ఇవ్వడం కంటే డ్రైవ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతాడు.

*రాజ్ ఠాక్రే
రాజ్ ఠాక్రే మహారాష్ట్ర నిర్మాణ  సమితి అధినేత. సొంత కార్లను నడుపుకుంటూ వెళతాడు. రాజ్ ఠాక్రే తన సోదరుడిలాగే ఎస్-క్లాస్ లో తిరుగుతాడు. అతను తన సెక్యూరిటీ గార్డులతో తన పక్కన కూర్చొని డ్రైవింగ్ చేస్తుంటాడు.

*సచిన్ పైలెట్
ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ కు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. టయోటా ఫార్చ్యూనర్ గా తిరుగుతాడు.  పొలిటికల్ ర్యాలీలలో సచిన్ కార్ డ్రైవ్ చేస్తుంటాడు.

*కిరణ్ రిజిజు
బీజేపీ కేంద్రమంత్రి కిరెన్ రిజిజు కూడా హిమాలయ రోడ్లపై ‘మహీంధ్రా థార్’ నడిపారు.  కార్లలో తిరగడం అతడికి చాలా ఇష్టం. పోలరిస్ కారు నడపడానికి ప్రయత్నిస్తాడు.

*అరుణాచల్ సీఎం పెమా ఖండు
అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు మంచుతో కూడిన రోడ్లపై పొలారిస్ ఏటీవీలో తిరిగారు. పెమా ఖండు హిమాలయాల ఎత్తైన రహదారులపై చాలా సాహసోపేతంగా నడిపాడు.

*జ్యోతిరాధిత్య సింధియా
మధ్యప్రదేశ్ యువ నేత కాంగ్రెస్ జ్యోతిరాధిత్య సింధియా  ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడారు. రాజకీయ నాయకుడు ల్యాండ్ రోవర్ రేజంక తిరుగుతూ కార్లు నడిపిస్తూ కనిపిస్తుంటాడు.
Tags:    

Similar News