ప్రపంచంలోని చెత్త పాస్ పోర్ట్ జాబితాలో పాక్.. మరీ భారత్ ర్యాంకెంత?

Update: 2023-01-12 13:30 GMT
లండన్ కు చెందిన ఓ ట్రావల్ సంస్థ 109 దేశాలకు సంబంధించిన పాస్ పోర్ట్ జాబితాను విడుదల చేసింది. వీటిని కేటగిరి వైజ్ గా విభజించి అత్యంత శక్తివంతమైన.. పరమ చెత్త పాస్ పోర్టులుగా తేల్చింది. ఈ జాబితాలో అత్యంత శక్తివంతమైన పాస్ పోర్టుగా జపాన్ ను గుర్తించగా చెత్త పాస్ పోర్ట్ జాబితాలో పాకిస్తాన్ ఒకటిగా నిలిచింది. ఈ జాబితాలో భారత్ ర్యాంకు ఎంతనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!

పరమ చెత్త పాస్ పోర్టు జాబితాలో ఆఫ్ఝనిస్థాన్ అగ్రస్థానంలో ఉంది. ఈ పాస్ పోర్టు ద్వారా వీసా రహిత ప్రయాణాన్ని కేవలం 27 ప్రదేశాలకు మాత్రమే అనుమతి ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ఇరాక్.. సిరియా ఉండగా పాకిస్థాన్ నాలుగో స్థానంలో ఉంది. పాకిస్థాన్ పాస్‌పోర్ట్‌ ఉన్నవారు వీసా ఆన్ అరైవల్ కింద కేవలం 35 దేశాల్లో మాత్రమే ప్రయాణించ వచ్చును.

యెమెన్ ఐదవ స్థానంలో నిలిచింది. ఈ దేశ పాస్‌పోర్ట్ కలిగిన వారు 34 దేశాల్లో వీసా రహిత చేయ్యవచ్చు. పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2023 నివేదిక ప్రకారంగా భారతీయ పాస్‌పోర్ట్ 85వ స్థానంలో నిలిచింది. భారత్ పాస్‌పోర్ట్ ఉన్నవారు ప్రపంచంలోని 59 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు.

2019లో భారత్  82 స్థానంలో ఉండగా 2020లో 84 స్థానానికి పడిపోయింది. 2021లో 85 స్థానంలో.. 2022 లో 83 వ స్థానంలో నిలిచింది. భారత్ పాస్ట్ పోర్టుతో భూటాన్.. కంబోడియా.. ఇండోనేషియా.. మకావో.. మాల్దీవులు.. నేపాల్.. శ్రీలంక.. థాయిలాండ్.. కెన్యా.. మారిషస్.. సీషెల్స్.. జింబాబ్వే.. ఉగాండా.. ఇరాన్.. ఖతార్ వంటి 59 దేశాల్లో భారత్ పాస్‌పోర్ట్ హోల్డర్లు వీసా లేకుండా ప్రయాణించవచ్చు.

జపాన్ లండన్‌కు చెందిన గ్లోబల్ సిటిజన్‌షిప్, రెసిడెన్సీ అడ్వైజరీ సంస్థ హెన్లీ & పార్ట్‌నర్స్ విడుదల చేసిన కొత్త నివేదిక ప్రకారం, మొత్తం 193 దేశాలకు వీసా ఆన్ అరైవల్ లేదా వీసా రహిత యాక్సెస్‌ను అందించే ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాలో జపాన్ అగ్రస్థానంలో నిలించింది.

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాను పరిశీలిస్తే జపాన్  మొదటి స్థానంలో ఉంది. ఈ దేశ పాస్ పోర్ట్ తో 193 దేశాల్లో ప్రయాణించవచ్చు. రెండో స్థానంలో సింగపూర్ దక్షిణ కొరియా సంయుక్తంగా ఉన్నాయి. ఈ దేశ పాస్ పోర్టుతో 192 దేశాలు చుట్టి రావచ్చు. మూడో స్థానంలో జర్మనీ.. స్పెయిన్ ఉండగా 190 దేశాల్లో ప్రయాణించవచ్చు.

నాలుగో స్థానంలో  ఫిన్లాండ్.. ఇటలీ.. లక్సెంబర్గ్  ఉండగ 189 దేశాల్లో ప్రయాణించవచ్చు. ఐదో స్థానంలో ఆస్ట్రియా.. డెన్మార్క్.. నెదర్లాండ్స్.. స్వీడన్ ఉన్నాయి. ఆరో స్థానంలో ఫ్రాన్స్.. ఐర్లాండ్.. పోర్చుగల్.. యునైటెడ్ కింగ్‌డమ్.. ఏడో స్థానంలో బెల్జియం.. న్యూజిలాండ్.. నార్వే.. స్విట్జర్లాండ్.. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా.. చెక్ రిపబ్లిక్ దేశాలు ఉన్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News