కశ్మీర్ ప్రీమియర్ లీగ్ ఆడకుండా నన్ను వేధిస్తోందని ఓ అంతర్జాతీయ క్రికెటర్ బీసీసీఐ పై ఆరోపణలు చేశాడు. త్వరలో, ప్రారంభమయ్యే ఈ లీగ్ లో దక్షిణాఫ్రికా మాజీ స్టార్ క్రికెటర్ హర్షలే గిబ్స్ పాల్గొనేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అయితే, తన ప్రయత్నాలకు బీసీసీఐ అడ్డు పడుతోందని సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశాడు. ఈ లీగ్ లో పాల్గొంటే, భవిష్యత్తు లో భారత్ లో జరిగే టోర్నీలతో పాటు పలు కార్యక్రమాలకు ఆనుమతి ఇవ్వమంటూ బెదిరిస్తోందని చెప్పాడు.
కాగా, ఈ మాజీ ఆటగాడు చేసిన ఆరోపణలపై బీసీసీఐ ఇంకా స్పందించ లేదు. వచ్చే నెల ఆగస్టు 6 నుంచి కేపీఎల్ కొత్త సీజన్ మొదలు కానుంది. ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా ఆటగాడితో పాటు లంక మాజీ ప్లేయర్ దిల్షాన్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు ఆడేందుకు ఓకే చెప్పారు. మొత్తం ఆరు టీంలు ఈ లీగ్ లో పాల్గొనబోతున్నాయి. గిబ్స్ మాట్లాడుతూ ... కేపీఎల్ ను భారత క్రికెట్ బోర్డు రాజకీయ అంశంతో రాద్దాంతం చేస్తోంది. కేపీఎల్ లో ఆడకుండా బీసీసీఐ బెదిరిస్తోంది. మామాట కాదని కేపీఎల్ లీగ్ లో ఆడితే.. భవిష్యత్తులో భారత్ లో జరిగే కార్యక్రమాలకు పిలిచేది లేదంటూ హెచ్చస్తోంది. ఈ విషయంలో బీసీసీఐ అభ్యంతరం తెలపడం నాకు నచ్చలేదు అంటే ట్విట్టర్ లో తెలిపాడు.
గతంలో ఇదే అంశంపై పాక్ మాజీ వికెట్ కీపర్ రషీద్ లతీఫ్ కూడా కశ్మీర్ ప్రీమియర్ లీగ్ లో పాల్గొనే ఆటగాళ్ల పట్ల బీసీసీఐ అనుసరిస్తున్న విధానంపై విమర్శలు గుప్పిస్తూ ట్వీట్లు చేశాడు. కేపీఎల్ లీగ్ లో పాల్గొనే ఆటగాళ్లపై బీసీసీఐ కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. కేపీఎల్ లో ఆడిన ప్లేయర్లను భారత్ లోకి అనుమతించమనడం సమంజసం కాదు అంటూ ట్వీట్ చేశాడు. కేపీఎల్ లీగ్ లో ఓవర్సీస్ వారియర్స్, ముజఫర్ బాద్ టైగర్స్, రావల్ కోట్ హాక్స్, బాగ్ స్టాలియన్స్, మీర్పూర్ రాయల్స్, కోట్లీ లయన్స్ టీమ్ లుగా ఆడనున్నాయి. ఆయా జట్లకు ఇమాద్ వసీమ్, మహ్మద్ హఫీజ్, షాహిద్ అఫ్రిది, షాబాద్ ఖాన్, షోయబ్ మాలిక్, కమ్రాన్ అక్మల్ లు సారథులుగా వ్యవహరించనున్నారు.