కొన్ని అసాధ్యం అనుకుంటాం. అనూహ్యం అనుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో అలా జరగడానికి వీల్లేదని తీర్మానించేస్తుంటాం! కానీ, అక్కడే ఆగిపోతే మానవ మేధస్సు గొప్పతనం ఏముంటుంది..? ఏది అసాధ్యం కాదో.. దాన్ని సుసాధ్యం చేయడంలోనే పురోగతి ఉంటుంది. ఎప్పుడో అంతరించి పోయిన డైనోసార్ పై సవారీకి వెళ్తే వెళ్తే ఎలా ఉంటుందో చెప్పండీ..! హాలీవుడ్ సినిమాల్లో పెద్దపెద్ద సాలీడ్లను చూస్తాం. అలాంటి వాటిపైకి ఎక్కి కూర్చుని, షికారు చేస్తే ఎలా ఉంటుందో చెప్పండీ..! డ్రాగర్ రెక్కలపై కూర్చేని, గాల్లో ఎగురుతూ ఉంటే.. ఆ అనుభూతి ఎలా ఉంటుందీ..? అనకొండ వీపుపైకి ఎక్కి... అలాఅలా పరుగులు తీస్తూ దూసుకెళ్లిపోతే ఆ మజా ఎలా ఉంటుందీ..? ఇవన్నీ ఊహల్లో మాత్రమే కాదు... వాస్తవంలో కూడా సాధ్యమే..!
ఇలాంటి కోరికల్ని తీర్చుకోవాలంటే ఫ్రాన్స్ కు వెళ్లాల్సిందే. అక్కడో థీమ్ పార్క్ ఉంది. 35 భారీ ప్రాణుల్ని అక్కడ మనం చూడొచ్చు. వీటన్నింటినీ భారీ యంత్ర పరికరాలతో రూపొందించారు. చూడ్డానికి అచ్చం సాధారణ జంతువుల్లానే ఉంటాయి. కాకపోతే.. సైజులో మాత్రం భారీగా ఉంటాయి. ఈ పార్కులో ఉన్న ఏనుగు 40 అడుగులు ఎత్తులో ఉంటుంది. దీనిపై ఒకేసారి 50 మంది ఎక్కి కూర్చోవచ్చు. మొత్తం మూడు అంతస్తులు ఇందులో ఉంటాయి. దీన్ని తయారు చేయడం కోసం ఓ 40 టన్నుల ఉక్కుతోపాటు, కలపను కూడా వాడారు.
ఇక... ఈ పార్కులో భారీ సాలీళ్లూ చేపలూ గుర్రాలూ డ్రాగన్లూ పాములు కూడా ఉన్నాయి. వీటిని కూడా వివిధ లోహాలతో తయారు చేశారు. ఫ్రాంకోయిస్, పియర్ అనే ఇంజినీర్లు ఈ అద్భుతాలకు ప్రాణ ప్రతిష్ఠ చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/