ఇప్పటివరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా మాత్రమే నిరసనలు మిన్నంటడం చూశాం. కానీ, తాజాగా ఆయన కూతురు ఇవాంక ట్రంప్ కు వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి. వాషింగ్టన్ లోని కలోరమలోగల ఇవాంక నివాసం వద్ద శనివారం రాత్రి పెద్ద మొత్తంలో నిరసనకారులు చేరి పెద్ద ఎత్తున్న నినాదాలు చేశారు. వీరికి స్వలింగసంపర్కుల(ఎల్జీబీటీ) మద్దతు కూడా తోడైంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
భిన్న వస్త్రాలు, వింత వేషాలతో అక్కడికి చేరుకొని రకరకాల పాటలు పాడుతూ ఇష్టం వచ్చినట్లు ఇవాంకను తిడుతూ హోరెత్తించారు. పర్యావరణ భద్రత విషయంలో ఒబామా తీసుకొచ్చిన పాలసీలన్నింటిని రద్దు చేసే విషయంలో వెనక్కి తగ్గాలని డిమాండ్ చేస్తూ వారు నిరసనలు మొదలుపెట్టారు. ఆమె ఇంటివైపు దూసుకెళుతుండగా అడ్డుకున్న ఓ వ్యక్తిపై దాడి కూడా చేశారు. అయితే, ఆ సమయంలో ఇవాంక ఇంట్లో లేనట్లు తెలిసింది. ఆమె శుక్రవారమే న్యూయార్క్ లో తన కుమారుడి పుట్టిన రోజు వేడుకలు జరిపేందుకు అక్కడికి వెళ్లినట్లు సమాచారం. ఇవాంకకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
ఇదిలాఉండగా...అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకులు ప్రతీ సందర్భాన్నీ సద్వినియోగం చేసుకుంటున్నారు. 'డొనాల్డ్ ట్రంప్ ను కింగ్ ఆఫ్ ఫూల్స్‌గా ఎంపిక చేశాం` అంటూ ఆయన వ్యతిరేకులు న్యూయార్క్ లో ఫూల్స్ డేను భారీ స్థాయిలో నిర్వహించారు. ఈసారి జరిగిన ఏప్రిల్ ఫూల్స్ డే పరేడ్ మాత్రం ప్రత్యేకంగా ఉంటుందని ర్యాలీ నిర్వాహకులు ముందుగానే ప్రకటించారు. అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధంకు తమ భావాల్ని తెలియజేయాలన్న ఉద్దేశం ఇందులో ఉందని ర్యాలీలో పాల్గొన్నవారు మీడియాకు తెలిపారు. న్యూయార్క్‌లోని సెంట్రల్ పార్క్ వద్ద ర్యాలీ ప్రారంభమై ట్రంప్ టవర్స్ వద్ద ముగిసింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/