విదేశీ విరాళాలతో నడుస్తున్న స్వచ్చంధ సంస్ధలపై నరేంద్ర మోడీ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. దాదాపు 6 వేల ఎన్జీవోలకు లైసెన్సుల రెన్యువల్ తిరస్కరించటమో చేయటమో రద్దు చేయటమో జరిగింది. దీంతో దేశంలోని కొన్ని వేల సంస్థలకు నిధులకు ఇబ్బందులు వచ్చాయి. విదేశీ సంస్థల నుంచి భారీ ఎత్తున విరాళాలు అందుకుంటూ మత మార్పిడులకు పాల్పడుతున్నాయని, అక్రమాలకు పాల్పడుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో కేంద్రం అన్నింటిపైనా ఉక్కుపాదం మోపింది.
నిజానికి విదేశీ విరాళాలతో మత మార్పిడులకు పాల్పడుతున్నాయనేది ఆరోపణలు మాత్రమే. దీనిపై విచారణ జరిపిన కేంద్ర సంస్థలు నిర్దిష్ట ఆధారాలను సేకరించలేకపోయాయి. ఆధారాలను సేకరించలేకపోయినంత మాత్రాన అవేవీ నిజాలూ కాకపోవు. అయితే అనుమానంతో విదేశీ విరాళాలు అందకుండా అడ్డుకోవటం మాత్రం తప్పే. కానీ కేంద్రం ఇపుడు ఆ పనిచేసింది. పోయిన సంవత్సరం+ఇప్పటివి కలిపితే దాదాపు 12 వేల సంస్ధలకు విదేశీ విరాళాలు ఆగిపోయాయి.
విదేశాల నుంచి విరాళాలు అందుకోవాలని అనుకున్న స్వచ్ఛంద సంస్థలు కేంద్ర హోంశాఖకు దరఖాస్తు చేసుకోవాల్సుంటుంది. కేంద్ర హోంశాఖ అన్ని విషయాలను పరిశీలించి అప్పుడు అనుమతిపై ఒక నిర్ణయం తీసుకుంటుంది. దేశంలో అతి పెద్దది అయిన మిషనరీ ఆఫ్ చారిటీస్ కు దాదాపు 250 దేశాల నుంచి భారీ విరాళాలు అందుతుంటాయి. గుజరాత్ లో ని ఈ సంస్ధలో మతమార్పిళ్ళకు పాల్పడుతున్నారని చాలాకాలంగా ఆరోపణలున్నాయి. దీన్ని ఏర్పాటు చేసింది మధర్ థెరిస్సా. అందుకనే దీని లైసెన్సును రద్దుచేయటంపై ప్రతిపక్షాలు కేంద్రంపై మండిపోతున్నాయి.
లైసెన్సులను కోల్పోయిన సంస్ధల్లో ఐఐటీ ఢిల్లీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ, జామియా మిలియా యూనివర్సిటీ, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్, లాల్ బహదూర్ శాస్త్రి మెమోరియల్ ఫౌండేషన్, ఆక్స్ ఫామ్ ఇండియా, భారతీయ సంస్కృతి పరిషత్, డీఏవీ కాలేజ్ అండ్ ట్రస్ట్ అండ్ మేనేజ్మెంట్ అండ్ అసోసియేషన్, ఢిల్లీ స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్ సొసైటీ, లేడీ శ్రీ రామ్ కాలేజ్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సొసైటీ లాంటి అనేక సంస్ధలున్నాయి.