అతడికి ప్రతీ సెకండ్ కు 3 లక్షల ఆదాయం

Update: 2020-09-14 16:00 GMT
మనపై వర్షం కురిస్తేనే తడిసి ముద్దవుతాం.. కానీ ఆయనపై కాసుల వాన కురుస్తోంది. కళ్లు మూసి తెరిచే సెకన్ కాలంలోనే ఆయనపై 3 లక్షలు వచ్చి పడుతున్నాయి. ఇంతటి సంపాదనను ఏం చేస్తాడు? ఎలా ఖర్చు పెడుతాడు? వేలు సంపాదించడానికి మనం ముక్కీ ములిగి నెలంతా గొడ్డు చారికీ చేస్తుంటే.. సెకనుకు 3 లక్షలు సంపాదించే ప్రపంచంలోనే అత్యంత కుబేరుడైన నంబర్ 1 ధనవంతుడు ఇక ఎలా ఫీల్ అవ్వాలి? ఆ ఫీలింగ్ మాటలకు అందనిదీ.. ఆయన ఎవరో కాదు.. అమేజాన్ అధినేత జెఫ్ బెజోస్..

ప్రపంచంలోనే నంబర్ 1 ధనవంతుడిగా మారిన జెఫ్ బోజెస్ నిజానికి మొదట్లో చిన్నా గ్యారేజ్ తోనే సంసారం సంపాదన మొదలు పెట్టాడు. 1995లో ఓ చిన్న గ్యారేజ్ లో అమేజాన్ ఆఫీస్ ను ప్రారంభించిన జెఫ్ బెజోస్ నేడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా మారడం వెనుక అతడి కృషి పట్టుదల ఉంది.

ఇంటర్ నెట్ ప్రభావాన్ని మొదట్లోనే అంచనావేసిన జెఫ్ తన పుస్తక దుకాణాన్ని ఆన్ లైన్ లో ప్రారంభించాడు. తర్వాత అన్ని పుస్తకాలను ఆన్ లైన్ లో అమ్మడం మొదలుపెట్టి సంపదను అనేక రెట్లు సృష్టించాడు.

ఒకప్పుడు పొట్టకూటి కోసం మెక్ డొనాల్డ్స్ లో పనిచేసిన జెఫ్ ఇప్పుడు సెకనుకు రూ. 3లక్షలు సంపాదిస్తున్నాడని తెలిసింది.

అలా ఎవరికైనా జీవితంలో ఒకే ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. ఆలోచనలకు రెక్కలొస్తే ఆదాయం దానంతట అదే పెరుగుతుంది. కావాల్సిందల్లా దానిని ఆచరణలో పెట్టడమే. ప్రపంచంలోనే ఆన్ లైన్ మార్కెట్ తో కోట్లు సంపాదిస్తున్న జెఫ్ బెజోస్ ఇప్పుడు అందరికీ ఆదర్శం అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Tags:    

Similar News