ఏపీలో మద్యం అమ్మకాలు తగ్గాయని గట్టిగా వైసీపీ ప్రభుత్వం ప్రకటించుకుంది. స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో కూర్చుని నిర్వహించిన సమీక్షలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. ఏపీలో మద్యం అమ్మకాలు బాగా తగ్గాయని ఆయన అధికారులను ఉద్దేశించి చెప్పారు.
దానికి కారణాలు ఏంటి అంటే మద్యం నియంత్రణ కోసం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుందని వెల్లడించారు. అలాగే షాక్ కొట్టేలా మద్యం ధరలను పెంచేయడం వల్ల మద్యం ప్రియులు దెబ్బకు జడిసి తాగడం మానుకున్నారని కూడా చెప్పుకున్నారు. సరే ఇదంతా ప్రభుత్వం వారి భావనగా ఉన్నా అసలు నిజంగా అలా జరుగుతోందా అంటే లేదు అనే చెప్పాలి.
ఏపీలో మద్యం ధరలు ఎక్కువగా ఉన్నాయని ఎవరూ మద్యం మానడంలేదు. అక్రమ మద్యం ఏరులై పారుతోంది. అలా సైడ్ బిజినెస్ పెద్ద ఎత్తున పెరిగింది. అలాగే నియంత్రణ కూడా గట్టిగా ఉందని జడుసుకోవడంలేదు. పొరుగురాష్ట్రాలకు వెళ్ళి మంచి బ్రాండ్లకు తక్కువ ధరలకు తెచ్చుకుని తాగే మందు బాబులు హ్యాపీగా తాగుతున్నారు. అది ఒక విధంగా సర్కార్ ఆదాయానికి గండి కొట్టేలా చేస్తోంది. ఇక ఏపీలో గంజాయి ఇంతకు ముందు ఇంతలా వినియోగంలో లేదు.
ఎపుడైతే వేరే కొత్త బ్రాండ్ల మద్యం ఏపీలోకి తీసుకు వచ్చారో నాటి నుంచి మద్యం ప్రియులు వాటి జోలికి పోలేక గంజాయి వైపుగా మళ్ళారని కూడా నివేదికలు చెబుతున్నాయి. దాంతో పెద్ద ఎత్తున అక్రమ గంజాయి ఏపీలో పెద్ద ఎత్తున ఒక భారీ వ్యాపారంగా మారి కూర్చుంది అని చెబుతున్నారు.
కల్తీ సారా మరో వైపు పెను సవాల్ గా మారింది. నేపధ్యం ఇలా ఉంది. ఇంకో వైపు మద్యం బానిసలు తాగేవాళ్ళు తాగుతున్నారు. సర్కార్ వారి పాటకు బాగానే డిమాండ్ వచ్చి పడుతోంది. ఏ ఏటికి ఆ ఏడు ఖజానాకు మద్యం ఆదాయం భారీ ఎత్తున సమకూరుతోంది. ప్రస్తుతం లెక్కలు చూస్తే పాతిక వేల కోట్ల దాకా ఏటా మద్యం ద్వారా ఆదాయం వస్తోందని అంటున్నారు.
ఇది ఇంతకు ఇంతగా పెరుగుతూంటే ప్రభుత్వం మాత్రం మద్యం అమ్మకాలు తగ్గాయని చెబుతోంది. అదే టైం లో ముఖ్యమంత్రి అక్రమ మద్యం తయారీ విక్రయం మీద నిఘా పెట్టి సంగతి తేల్చాలని ఆదేశాలు ఇవ్వడాన్ని కూడా చూస్తే మద్యం ప్రియుల దాహం ఎక్కడా తగ్గలేదనే అర్ధమవుతోంది అని అంటున్నారు.
అక్రమ మద్యం దారులకు ప్రత్యేకంగా జీవనోపాధి కల్పించాలని, అక్రమ మద్యం సాగుదారులకు ఉపాధి కల్పించాలని జగన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మరి అక్రమ మద్యం, అక్రమ గంజాయి ఉందని ప్రభుత్వమే చెబుతున్న వేళ ఏపీలో మద్యం ఎలా తగ్గింది. ఆదాయం పెరిగినపుడు మద్యం అమ్మకాలు ఎలా తగ్గాయి ఇవన్నీ ప్రశ్నలు. ప్రజలకు అసలు నిజాలు తెలుసు అంటున్నాయి విపక్షాలు.
ఇవన్నీ పక్కన పెట్టి ఆలోచించినా ఒకసారి బానిస అయిన వారు లైఫ్ లాంగ్ వాటికే దాసులుగా ఉంటారు. ఇక ఇంకా ఆ వైపుగా చూసే సర్కార్ వారి ఆదాయం పెరుగుతున్న వేళ మద్యం అమ్మకాలు తగ్గడం అన్నది ఆలోచించాల్సిన విషయమే అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.