ముస్లిం మహిళల జీవితాల్ని అన్యాయం చేసే ట్రిపుల్ తలాక్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇవ్వటం తెలిసిందే. తలాక్ మీద సుప్రీం తీర్పుపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. ముస్లిం మహిళలు అయితే ఏకంగా పండగ చేసుకున్న పరిస్థితి.ఆ మధ్య వరకూ తలాక్ విషయంపై వ్యతిరేకంగా మాట్లాడిన గొంతులు.. సుప్రీం తీర్పు నేపథ్యంలో కామ్ అయ్యాయి. ఇదిలా ఉంటే.. తలాక్ విషయంలో ముస్లిం దేశాల తీరు ఏమిటన్నది ఆసక్తికరంగా మారాయి. ఈ విషయంలో వారు మనకంటే ఎంతో ముందు ఉన్నారన్న విషయం తెలిసిందే అయినప్పటికీ ఎంత అన్న లోతుల్లోకి వెళితే.. మన దేశంలోని ముస్లిం మహిళలకు న్యాయం జరిగే విషయంతో ఎంత ఆలస్యమైందన్న విషయం అర్థం కాక మానదు.
ముస్లింలు అత్యధికంగా ఉండే ఇండొనేషియా.. పాకిస్థాన్.. ఈజిప్టు.. బంగ్లాదేశ్ తదితర దేశాల్లోనూ తలాక్ను నిషేధించిన జాబితాలో ఉన్నాయి. మరి.. ముస్లిం దేశాల్లో మహిళల విడాకులకు అనుసరించే విధానాలు ఏమిటన్నది ఆసక్తికరమైన అంశంగా చెప్పాలి. మొత్తంగా చూస్తే.. ముస్లిం దేశాల్లో నాలుగు విధాల్లో విడాకులు ఇస్తున్నారని చెప్పక తప్పదు. పలు ముస్లిం దేశాల్లో తలాక్‌ను అనుసరిస్తున్న వైనం చూస్తే..
ఈజిప్టు: అత్యధికంగా ముస్లింలు ఉండే ఈ దేశమే తొలుత తలాక్ కు చెక్ చెప్పింది. 1929లోనే తలాక్ విధానానికి సవరణలు చేశారు. తలాక్ కు తలాక్ కు మధ్య 90 రోజుల వ్యవధి ఉండాలన్నది అక్కడ రూల్. మూడుసార్లు తలాక్ చెప్పినా దాన్ని మొదటి విడత కిందకే లెక్కిస్తారు.
టర్కీ: 99 వాతం ముస్లింలు ఉన్న ఈ దేశంలో తలాక్ విధానాన్ని ఎప్పుడో నిషేధించారు. 1926లోనే స్విస్ పౌరస్మృతిని అంగీకరించింది. దీంతో.. తలాక్ విధానం రద్దైయింది.
పాకిస్థాన్: 96 శాతం ముస్లిం జనాభా ఉన్న ఈ దేశంలో 1961లోనే తలాక్ ను నిషేధించారు. భార్యకు విడాకులు ఇవ్వాలనుకునే వ్యక్తి ముందుగా న్యాయమండలి ఛైర్మన్‌కు.. తన భార్యకు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. 90 రోజుల సమయంలో ఇరువర్గాల మధ్య కౌన్సెలింగ్ నిర్వహించి కలిపే ప్రయత్నం చేస్తారు. కుదరకుంటే విడాకులు మంజూరు చేస్తారు.
ఇండొనేషియా: 90 శాతం ముస్లింలు ఉన్న ఈ దేశంలో తలాక్ ద్వారా విడాకులకు వీల్లేదు. ఇండొనేషియా వివాహ నిబంధనల్లోని ఆర్టికల్ 19 ప్రకారం విడాకులు కోరుకునే వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది.
బంగ్లాదేశ్: 89 శాతం ముస్లిం జనాభా ఉన్న ఈ దేశంలో తలాక్ విధానం చెల్లదు
ఇరాన్: 87 శాతం ముస్లింలు ఉన్న ఈ దేశంలో తలాక్ విధానానికి 1992లోనే సవరణలు చేపట్టారు.
శ్రీలంక: తలాక్ చెప్పాలంటే ముందుగా బంధువులు.. స్థానికుల సమక్షంలో ఖ్వాజీకి సమాచారం ఇవ్వాలి. ఆ జంట కలిసి ఉండేలా అందరూ ప్రయత్నిస్తారు. అలా కుదరని పక్షంలో 30 రోజుల తర్వాత విడాకులు ఇచ్చే అవకాశం ఇస్తారు. ఖ్వాజీ.. ఇద్దరు సాక్షుల సమక్షంలో ఈ ప్రక్రియ చేస్తారు.
ట్యూనీషియా: ఈ ముస్లిం దేశంలో తలాక్ చెల్లదు. తలాక్కు కారణాన్ని మతపెద్దలు.. న్యాయమూర్తులకు కారణం చెప్పాలి. రాజీకి కొంత గడువు ఇచ్చిన తర్వాతే కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది. 1956లొ దీనికి సవరణలు చేశారు.
అల్జీరియా: తలాక్ చెల్లుదు. అలా చెప్పటానికి కుదరదు. కోర్టు మాత్రమే విడాకులు మంజూరు చేస్తుంది. రాజీ యత్నాలు చేసిన తర్వాత..మూడు నెలల గడువులో విడాకులు ఇస్తారు.