కోట్లకు ప‌డ‌గ‌లెత్తారు..అభ్య‌ర్థుల‌కు దిమ్మ‌తిరిగే ఆస్తులు!

Update: 2018-11-20 11:58 GMT
ఈరోజుల్లో ఏసీబీ రైడ్లు చూసి చూసి మ‌న‌కు వంద కోట్లు రెండు వంద‌ల కోట్లు అల‌వాటైపోయింది గాని... వంద కోట్లు అంటే... బ్యాంకు వ‌డ్డీతో వ‌చ్చిన ఆదాయంపై ట్యాక్స్ క‌ట్టినా మిగిలిన వైట్ మ‌నీతో బీఎండ‌బ్ల్యూ కార్ల‌లో తిరుగుతూ కావ‌ల్సింది తిని తిరుగుతూ ప‌నీ పాటా లేకుండా ఎంజాయ్ చేయొచ్చు. తెలంగాణ ఎన్నిక‌ల నామినేష‌న్లు ముగిసిన త‌ర్వాత పోటీలో నిల‌బ‌డిన అభ్య‌ర్థుల ఆస్తులు క‌ళ్లు చెదిరేలా ఉన్నాయి. 3,584 మంది అభ్య‌ర్థులు నామినేష‌న్లు వేయ‌గా... వారంద‌రిలోకి సంప‌న్నుడు న‌ల్గొండ కాంగ్రెస్ అభ్య‌ర్థి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి. ఆయ‌న ఆస్తి 314 కోట్లు. ఇది అధికారికంగా చూపించిన ఆస్తి మాత్ర‌మేనండోయ్‌. మిగ‌తా మాకు తెలియ‌దు - మ‌మ్మ‌ల్ని అడ‌గొద్దు.

వంద కోట్ల ఆస్తులు అధికారికంగా చూపిన వాళ్లు ఇంకా న‌లుగురు ఉన్నారు. వారిలో మ‌ర్రి జ‌నార్ద‌న్‌ రెడ్డి (టీఆర్ ఎస్‌)- 161 కోట్లు - భువ‌న‌గురి కాంగ్రెస్ అభ్య‌ర్థి కె.అనిల్‌ కుమార్ రెడ్డికి 151 కోట్లు - బీజేపీ శేరిలింగంప‌ల్లి అభ్య‌ర్థి యోగానంద్‌ కు 146 కోట్లు - ఖ‌మ్మం టీడీపీ అభ్య‌ర్థి నామా నాగేశ్వ‌ర‌రావుకు 110 కోట్ల ఆస్తులున్నాయ‌ట‌. అస‌లు వీళ్లకు చాలా డ‌బ్బుంద‌ని జ‌నానికి తెలుసు గాని వైట్ మ‌నీయే ఇంత ఉంటే... అంటూ జ‌నం ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

ప‌ది కోట్ల కంటే ఎక్కువ ఆస్తుల లెక్క చెప్పిన అభ్య‌ర్థుల జాబితా ఇది.
పొన్నాల ల‌క్ష్మ‌య్య - 64 కోట్లు
దానం నాగేంద‌ర్ - 41 కోట్లు
కేటీఆర్ - 41 కోట్లు (భార్య‌తో క‌లిపి)

ఇది అఫిషియ‌ల్ లెక్క‌. ఇంకా వీరితో పాటు దాదాపు రెండు పార్టీల నుంచి 119 నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేస్తున్నా 238 అభ్య‌ర్థుల్లో దాదాపు 150 మంది అభ్య‌ర్థుల‌ ఆస్తుల విలువ వంద కోట్ల‌కు పైమాటే గాని త‌క్కువ ఉండ‌దు. భ‌వ్య ఆనంద్‌ ప్ర‌సాద్‌ కు - జూప‌ల్లి కృష్ణారావు - మ‌ధుయాష్కీ... ఇలాంటి వారికి చాలా ఆస్తులున్నాయి. కొంద‌రికి కంపెనీల పేర్ల మీద ఉన్నాయి. అయినా ఒక‌ప్పుడు రాజ‌కీయాల్లోకి వ‌చ్చి కోటీశ్వ‌రులు అయ్యేవారు. కానీ ఇపుడు కోటీ శ్వ‌రులు అయితేనే రాజ‌కీయాల్లోకి రాగ‌లుగుతున్నారు. ప‌రిస్థితులు అలా మారిపోయాయి. ట్రెండ్ న‌డుస్తోంద‌లా!


Tags:    

Similar News