టీడీపీలో పెరుగుతున్న మంత్రుల జాబితా!

Update: 2022-06-28 03:57 GMT
ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ పుంజుకుంటోంద‌నే ఆనందం ఒక‌వైపు ఉంటే.. అదేస‌మ‌యంలో పార్టీలో ప‌ద‌వులు ఆశించేవారి జాబితా కూడా పెరుగుతుండ‌డం ఇప్పుడు పార్టీలో చ‌ర్చ‌కు దారితీస్తోంది. నిన్న‌టి వ‌ర‌కు కూడా పార్టీ పుంజుకుంటే చాల‌ని పార్టీ అధినేత నుంచి కింది స్థాయి వ‌ర‌కు అంద‌రూ అనుకున్నారు. కీల‌క నేత‌లు సైతం ఇదే కోరుకున్నారు. పార్టీనే న‌మ్ముకుని న‌డుస్తున్న వారు కూడా.. పార్టీ పుంజుకోవాల‌ని ఆశించారు.

ఇప్పుడు వారు ఊహించిన‌ట్టుగానే పార్టీ పుంజుకుంది. అయితే.. గ‌తానికి భిన్నంగా.. సీనియ‌ర్ల కంటే.. ఎక్కువ‌గా జూనియ‌ర్లు ప‌నిచేస్తున్నారు. కొత్త‌గా పార్టీలోకి వ‌చ్చిన వారు.. ఒక‌టి రెండు సార్లు ఎమ్మెల్యేలు అయిన‌వారు.. పార్టీని ప‌రుగులు పెట్టిస్తున్నారు. ఏ జిల్లాను తీసుకున్నా.. ఒక‌ప్పుడు సీనియ‌ర్ల హ‌వా క‌నిపించేది. సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానంలో ఉన్న నాయ‌కు లు జిల్లాను శాసించే వారు. అయితే.. ఇప్పుడు టీడీపీలో ఈ ప‌రిస్థితి పూర్తిగా పోయింది. జూనియ‌ర్లు పుంజుకుంటున్నారు.

వాస్త‌వానికి కావాల్సింది కూడా ఇదే. ఎందుకంటే.. జూనియ‌ర్లు అయితే.. క‌సితో ప‌నిచేస్తారు. స‌ర్కారు వ‌చ్చేలా చేస్తారు. పార్టీ అధినేత చంద్ర‌బాబు కూడా ఇదే ఆశించారు. ఇక‌, ఇక్క‌డితో విష‌యం ఆగిపోతే.. ప‌రిస్థితి వేరేగా ఉండేది.

కానీ.. ఇలా పార్టీకి వెన్నుద‌న్నుగా ఉన్న నాయ‌కులు.. ప‌ద‌వులకు పోటీ వ‌స్తున్నారు. ముఖ్యంగా మంత్రి వ‌ర్గ జాబితాలో పేర్లు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు.. ప‌శ్చిమ గోదావ‌రిజిల్లాను తీసుకుంటే.. ఇద్ద‌రు నుంచి ముగ్గురి పేర్లు ఖ‌చ్చితంగా మంత్రి వ‌ర్గంలో ఉంటాయ‌ని ఇక్క‌డి వారు ఆశ‌లు పెట్టుకున్నారు.

అదేవిధంగా ఉమ్మ‌డి ప్ర‌కాశంలో ఏలూరి సాంబ‌శివ‌రావు, గొట్టిపాటి ర‌వి, డోలా బాల‌వీరాంజ‌నేయ స్వామి, ఉమ్మ‌డివిశాఖ నుంచి వంగ‌ల‌పూడి అనిత‌, ఉమ్మ‌డితూర్పు గోదావరి నుంచి కేఎస్ జ‌వ‌హ‌ర్‌, ఉమ్మ‌డి కృష్నా నుంచి దేవినేని ఉమా, తంగిరాల సౌమ్య‌, బొండా ఉమా.. ఇలా చాలా మంది పేర్లు వినిపిస్తున్నా యి. ఇప్పుడు ఈ జాబితాలో దామ‌చ‌ర్ల జ‌నార్ద‌న్ పేరు కూడా చేరింది.

అదేవిధంగా అనంత‌పురం నుంచి కూడా కాల్వ శ్రీనివాసులు, ప‌రిటాల శ్రీరాం, చిత్తూరు నుంచి బొజ్జ‌ల సుధీర్‌రెడ్డి ఇలా.. లెక్కకు మిక్కిలిగా నాయ‌కులు పెరుగుతున్నారు. మ‌రి వీరిని ఎలా సంతృప్తి ప‌రుస్తారు?  అనేది ప్ర‌శ్న‌. ఏదేమైనా.. పార్టీ పుంజుకోవ‌డం మంచిదే అయినా.. అంద‌రికీ ప‌ద‌వులు ఇస్తామ‌నే ప్ర‌చారం పెద్ద ఇబ్బందిగా అయితే మారుతుంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.
Tags:    

Similar News