ఆ తప్పే ప్రాణాల్ని తీస్తోంది.. వీడియో పోస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు

Update: 2021-08-03 10:42 GMT
చిన్నపాటి నిర్లక్ష్యం.. రెప్పపాటులో జరిగే ప్రమాదం విలువైన ప్రాణాల్ని తీసేలా చేయటమే కాదు.. అయిన వారిని.. నమ్ముకున్న వారికి తీరని శోకాన్ని మిగులుస్తుంది. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. భారీ ఎత్తున ప్రాణాలు పోతున్న పరిస్థితి. ప్రమాదాలకు కారణం ఏమిటన్నది చూస్తే.. నిర్లక్ష్యం.. అతి వేగం.. ఓవర్ టేక్ చేసే ప్రయత్నాలు కారణంగా చెప్పాలి. ప్రమాదాల మీద అవగాహన కల్పించటంతో పాటు.. విలువైన ప్రాణాల్ని చిన్న విషయాలకు తీసుకోవద్దని చెప్పేందుకు పోలీసులు తరచూ ప్రయత్నిస్తున్నారు.

కానీ.. ఎవరికి వారు తమకు ఏమీ కాదన్న ధీమా ప్రాణాల్ని తీస్తోంది. తమ వరకు వచ్చాక కానీ ప్రమాద తీవ్రత తెలుస్తుంది. కానీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. తాజాగా సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు తమ సోసల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. జులై 17న నగర శివారు అయిన బాచుపల్లిలో ఒక ప్రమాదాన్ని షేర్ చేసి.. ప్రమాదానికి గల కారణాన్ని వివరించే ప్రయత్నం చేశారు.

తన పక్కన వెతున్న భారీ లారీని ఓవర్ టేక్ చేసిన యువకుడు.. అంచనా కట్టే విషయంలో జరిగిన పొరపాటు.. అతడి ప్రాణాలు పోయేలా చేసింది. వేగంగా వెళుతున్న లారీని.. దాని పక్కనుంచే వెళుతూ.. ఆ లారీని క్రాస్ చేసి పక్కకు వెళదామనుున్నాడు. అయితే.. అతడి అంచనా తప్పు కావటంతో అతడి వాహనాన్ని లారీ ఢీ కొట్టటం.. ఆ ప్రమాదంలో ఆ యువకుడు అక్కడికక్కడే మరణించాడు. వాహనం నడపటంలో జరి


Full ViewFull View
Tags:    

Similar News