జ‌ర్న‌లిస్టుకు న‌మ‌స్తే తెలంగాణ సారీ

Update: 2022-10-08 04:04 GMT
ప‌త్రిక‌ల్లో కొన్నిసార్లు పొర‌పాట్లు చోటు చేసుకోవ‌డం, దానికి స‌వ‌ర‌ణ ప్ర‌చురించ‌డం మామూలే. ఐతే ఆ స‌వ‌ర‌ణ వేయ‌డం ఆషామాషీగా ఏమీ జ‌ర‌గ‌దు. ఒక వ్య‌క్తికి, అందులోనూ  క్ష‌మాప‌ణ చెబుతూ స‌వ‌ర‌ణ ఇవ్వ‌డం, క్ష‌మాప‌ణ చెప్ప‌డం అరుదైన విష‌యం.

ఇప్పుడు తెలంగాణ‌లో ప్ర‌ధాన ప‌త్రిక‌ల్లో ఒక‌టైన న‌మ‌స్తే తెలంగాణ అలాగే చేయాల్సి వ‌చ్చింది. ఢిల్లీ ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్‌లో ప‌ని చేస్తున్న లిజ్ మాథ్యూ అనే మ‌హిళా జ‌ర్న‌లిస్టుకు న‌మ‌స్తే తెలంగాణ సారీ చెప్పింది. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.

టీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీగా మారుస్తూ దానికి భార‌త్ రాష్ట్ర స‌మితి అనే కొత్త పేరు పెట్ట‌డం తెలిసిందే. కేసీఆర్ ఇలా పార్టీ పెట్ట‌డం, జాతీయ రాజ‌కీయాల్లో రావ‌డంపై ఆ పార్టీ ప్రొ పేప‌ర్ అయిన‌ న‌మ‌స్తే తెలంగాణ పెద్ద ఎత్తున క‌థ‌నాలు ఇచ్చింది.

ఈ క్ర‌మంలో దేశంలోని వివిధ రాజ‌కీయ ప‌క్షాలు, ప్ర‌ముఖుల‌తో అభిప్రాయాలు ప్ర‌చురించింది. అందులో కేసీఆర్ త‌ప్ప ఎవ‌రూ దేశాన్ని కాపాడ‌లేరు, ఆయ‌న అవ‌స‌రం దేశానికి చాలా ఉంది అన్న‌ట్లుగా అభిప్రాయాలు ఇచ్చారు. అందులో లిజ్ మాథ్యూ పేరిట కూడా ఒక ఒపీనియ‌న్ వ‌చ్చింది. ఐతే ఈ క‌థ‌నాన్ని లిజ్ మాథ్యూ ట్విట్ట‌ర్ ద్వారా ఖండించింది.

రాజ‌కీయాల్లో ఎవ‌రైనా పార్టీ పెట్టొచ్చ‌ని మాత్ర‌మే తాను చెప్పాన‌ని.. ఈ అభిప్రాయం త‌ప్పు అని ఆమె ఖండించింది. ట్విట్ట‌ర్లో ఈ విష‌యం వైరల్ కావ‌డంతో న‌మ‌స్తే తెలంగాణ ప‌త్రిక‌కు షాక్ త‌గిలింది.

ఆమెకు క్ష‌మాప‌ణ చెప్పింది. మామూలుగా ప‌త్రిక‌లు ఇలా ఒక వ్య‌క్తి హ‌ర్ట‌యితే, వార్త‌ను ఖండిస్తే లైట్ తీసుకుంటూ ఉంటాయి. కానీ లిజ్ మాథ్యూ ట్వీట్ వైర‌ల్ కావ‌డం, జ‌ర్న‌లిస్టు వ‌ర్గాల్లో దీని గురించి పెద్ద జ‌ర‌గ‌డంతో త‌ప్పును అంగీక‌రిస్తూ హుందాగా సారీ చెప్పి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News