ఎన్నికల్లో గెలిచిన ఆనందం కొందరిది అయితే , ఓడిన భాధ మరికొందరిది. తెలిసి కొందరు , అసలు ఆ విషయం తెలియకమరికొందరు చేసిన తప్పు ఇప్పుడు వారి పాలిట శాపంగా మారుతుంది. ఎన్నికల వ్యయం వివరాలు సమర్పించనందకు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా దాదాపు 40వేల మందిపై అనర్హత వేటు పడింది. ఇందులో కొందరు పదవులు సైతం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తెలంగాణ లో 2019 జనవరిలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. నిబంధనల ప్రకారం పోటీ చేసిన అభ్యర్థులందరూ తమ ఖర్చు వివరాలు మొత్తం ఈసీకి వెల్లడించాలి. దీనికి గెలుపోటములతో సంబంధం లేదు. ప్రతి ఒక్క అభ్యర్థీ తమ వ్యవ వివరాలు ఫలితాలు వెలువడిన 45 రోజులలోపు అందజేయాల్సి ఉంటుంది.
ఒకవేళ నిర్ణీత గడువులోగా వివరాలు సమర్పించకపోతే ఈసీ చర్యలు తీసుకుంటుంది. ఫలితంగా గెలిచినవారు పదవిని కోల్పోతారు. ఓడినవారు మూడేళ్ల పాటు పోటీకి అనర్హులవుతారు. ఇదే కోవలోనే 2019లో రాష్ట్రంలో జరిగిన పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో వార్డు సభ్యులు మొదలుకొని జడ్పీటీసీల వరకు పోటీచేసిన వారిలో 39,499 మంది అనర్హతకు గురయ్యారు. ఆ ఎన్నికల్లో ఓడిన వేలాది మందితోపాటు గెలిచి సర్పంచ్ లు అయిన 17 మంది, వార్డు సభ్యులు 3,499 మంది, ఎంపీటీసీలు ఆరుగురు ఉన్నారు. దీంతో గెలిచి అనర్హత వేటుకు గురయినవారి స్థానాలతోపాటు, వివిధ కారణాలతో ఏర్పడిన ఖాళీలకు త్వరలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం జియాపల్లి, జియాపల్లి తండా గ్రామ పంచాయతీల్లోని వార్డు సభ్యులంతా అనర్హత వేటుకు గురయ్యారు. ఈ రెండు పంచాయతీల్లో ప్రస్తుతం ఇద్దరు సర్పంచ్ లు మాత్రమే ఉనికిలో ఉండగా, వార్డు సభ్యులు లేకుండా పోయారు. 2019 పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన వీరంతా సకాలంలో ఎన్నికల ఖర్చు వివరాలను సంబంధిత అధికారులకు సమర్పించకపోవడం వల్లనే అనర్హత వేటు వేశారు. ఐదు వేలకుపైగా జనా భా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థి రూ.2.50లక్షలు, వార్డు మెంబర్ అభ్యర్థి రూ.50వేలు మాత్రమే ఖర్చు చేయాలి. అలాగే ఐదు వేలలోపు జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థి రూ.1.50లక్షలు, వార్డు అభ్యర్థి రూ.30వేలు దాటకుండా ఖర్చు చేయాలి.