లాక్ డౌన్ ఎఫెక్ట్: మెడికల్ స్టోర్స్ లో మందులు నిల్ !

Update: 2020-03-30 09:30 GMT
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పలు రంగాలు కుదేలవుతున్నాయి. ఇప్పటికే ఆర్థిక రంగం పై కరోనా ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తీవ్రంగా దెబ్బతీస్తోంది ఈ మహమ్మారి. ఈ వైరస్ ను అరికట్టడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా పలు దేశాలు ఇప్పటికే  ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించాయి. అందులో భారతదేశం కూడా ఒకటి. దీంతో చాలా మందిపై  ప్రభావం చూపెడుతోంది. ముఖ్యంగా లాక్ డౌన్ కారణంగా  జనజీవనం స్తంభించిపోతోంది. కరోనా వల్ల వచ్చే రోజుల్లో పెద్ద ఆపద ముంచుకొస్తుందోమోనని.. ప్రజలు భావించి.. నిత్యావసర సరుకుల నుంచి మొదలుకొని పలు వస్తువులను భారీగా కొనుగోలు చేస్తున్నారు.

అందులో మెడిసిన్స్ కూడా ఉన్నాయి. లాక్ డౌన్ పొడిగించే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ..  రోగులు ఎక్కువ మొత్తంలో మందులు కొనుగోలు చేస్తుండడంతో పలు దుకాణాల్లో వాటి నిల్వలు తగ్గి పోతున్నాయి. రక్తపోటు, చక్కెర వ్యాధులకు సంబంధించి, మందులతో పాటు ఇన్సులిన్ ఇంజెక్షన్లు ప్రస్తుత తరుణంలో అందుబాటు లేవని పలు మెడిసిన్స్ దుకాణ యజమానులు స్పష్టం చేస్తున్నారు. హైదరాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం తదితర జిల్లాల్లో ఈ పరిస్థితి నెలకొందని సమాచారం.

అలాగే  తయారీదారుల నుంచే సరఫరా నిలిచిపోయిందంటున్నారు. మందులు తయరు చేసే కంపెనీలు డిమాండ్ కు తగ్గ ఉత్పత్తి చేయడం లేదని అంతేగాకుండా.. రవాణాకు కార్మికులు అందుబాటులో లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది అని సమాచారం.
కర్నాటక, ఢిల్లీ, హైదరాబాద్, గుజరాత్ రాష్ట్రంలో ఉన్న పలు సంస్థలు కార్మికుల సమస్యలను ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 వేల టోకు, చిల్లర మెడిసిన్స్ దుకాణాలు ఉంటే..చాలా ప్రాంతాల్లో కొరత ప్రారంభమైందంటున్నారు.

అసలు లాక్ డౌన్ విషయంలో అత్యవసర సేవల కిందకు మందుల దుకాణాలు కూడా చేర్చారు. ఇవి బంద్ కావని వెల్లడించారు. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలు, మందుల షాపులు అందుబాటులో లేని వారు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.చాలామంది సుమారు మూడు నెలలకు సరిపడా మందులు కొనుక్కొంటున్నారని, కరోనా వ్యాప్తి నేపథ్యంలో మొదట్లో కొన్ని సంస్థల్లో ఉత్పత్తి నిలిచిందని, ఈ ప్రక్రియ ఇప్పుడిప్పుడే కొంత మేరకు ప్రారంభమైందని కొంతమంది వ్యాపారులు వెల్లడిస్తున్నారు. దీనితో తాగినన్ని మందులు స్టోర్స్ లో దొరికేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Tags:    

Similar News