ఊహించిందే జరిగింది. మరో 14 రోజులు లాక్ డౌన్ పొడిగిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అంటే దేశవ్యాప్తంగా ఈ నెల 31 వరకు లాక్ డౌన్ ఉండనుంది. కాసేపట్లో లాక్ డౌన్ 4.0 మార్గదర్శకాలు విడుదల చేస్తామని కేంద్రం పేర్కొంది.
దేశంలో కరోనా ప్రవేశించి 100 రోజులు దాటింది. ఇంకా పీక్ స్టేజీకి వచ్చినట్లు కనిపించడం లేదు. ఎందుకంటే ఎక్కడికక్కడ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈరోజు ఏకంగా 5 వేల కేసులు నమోదయ్యాయి. దీంతో లాక్ డౌన్ తీసేస్తారని ఎవరూ ఆశించలేదు. మన అంచనాలకు తగ్గట్టే లాక్ డౌన్ పొడిగించారు.
లాక్ డౌన్ 4.0 మార్గదర్శకాలను కొద్దిసేపట్లో కేంద్రం ప్రకటించనుంది. అయితే, కేసులు ఎన్ని పెరిగినా... ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి కేసులు లేని ప్రాంతాలతో పాటు కేసులున్న ప్రాంతాల్లోనూ అవసరాలను బట్టి కేంద్రం మరిన్ని సడలింపులు ఇవ్వడం మాత్రం గ్యారంటీ అన్న విషయం స్పష్టమవుతోంది.