కరోనా వైరస్ మహమ్మారితో ప్రపంచ దేశాలన్నీ కూడా భయంతో వణికిపోతున్నాయి. దీనితో అన్ని దేశాలు కఠినమైన ఆంక్షలు విధించి కరోనా వ్యాప్తిని నిలువరించే ప్రయత్నం చేశాయి. యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్లు వేశాయి. ఈ క్రమంలో అనేక దేశాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే కొన్ని దేశాల్లో మాత్రం కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. దీంతో నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. కరోనా నుంచి బయటపడేందుకు తప్పనిసరిగా టీకాలు తీసుకోవాలి.
యూరప్ లోని ఆస్ట్రియాలో కూడా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా 10 రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్టు ఆస్ట్రియా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ లాక్ డౌన్ అందరికీ కాదు. కేవలం వ్యాక్సిన్ తీసుకోని వారికి మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. వ్యాక్సిన్ తీసుకోని వారు బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆ దేశంలో ఇప్పటి వరకు కేవలం 65 శాతం మాత్రమే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు.
ఇప్పటికే కొన్ని దేశాలలో థర్డ్ వేవ్ మొదలైన నేపథ్యంలో.. ఇక ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకోవడం మరింత కచ్చితం గా మారిపోయింది. ఇలాంటి నేపథ్యంలో వ్యాక్సిన్ వేసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు రావాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు వ్యాక్సిన్ వేసుకోకుండా ఉన్న వారందరికీ కూడా లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది ఆస్ట్రేలియా ప్రభుత్వం. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసపింది. కొత్త నిబంధనల ప్రకారం వ్యాక్సిన్ తీసుకోనివారు పబ్లిక్ ప్లేస్ లోకి రావడానికి వీలు లేదు అంటూ కఠిన నిబంధనలు విధించింది. ఏదైనా అత్యవసరం అయితే తప్పా బయటకి రావడానికి వీల్లేదు అని అధికారులు చెప్పారు.