పెద్దల సభకి ఆయుధాల సవరణ బిల్లు ..!

Update: 2019-12-10 09:15 GMT
కేంద్రం మరో కీలక బిల్లుకి ఆమోదం తెలపనుంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఆయుధాల సవరణ బిల్లును మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఆయుధాల సవరణ బిల్లుకు సోమవారం లోక్‌ సభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ సవరణ బిల్లు ప్రకారం ఒక వ్యక్తికి రెండు లైసెన్స్‌ డ్‌ ఆయుధాలు మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువగా ఉంటే చట్ట ప్రకారం నేరం. అలాగే  అక్రమంగా ఆయుధాలు తయారు చేసేవారికి శిక్ష పెరుగుతుందని కూడా అమిత్‌ షా వెల్లడించారు. దేశ భద్రత దృష్ట్యా ఆయుధాలు - ఆయుధ సామాగ్రిని సమర్ధవంతంగా అదుపు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని బిల్లు ప్రవేశ పెట్టే తరుణంలో అమిత్‌ షా తెలిపారు. 

అయితే క్రీడాకారులెవరి పైనా ఈ నిబంధన ప్రభావం ఉండదని కూడా హామీ ఇచ్చారు.  బిల్లు ప్రకారం - చట్టవిరుద్ధంగా ఆయుధాలు తయారీ - అమ్మకాలు జరిపితే 7 ఏళ్ల నుంచి జీవిత ఖైదు పడుతుందని - అక్రమ ఆయుధాలు కలిగి ఉంటే 7 ఏళ్ల నుంచి 14 ఏళ్లు జైలు శిక్ష పడుతుందని అమిత్‌షా తెలిపారు. పోలీసు సిబ్బంది నుంచి ఆయుధాలు ఎత్తుకు వెళ్తే జీవిత ఖైదు పడుతుందన్నారు. చట్టవిరుద్ధంగా మారణాయుధాలతో జరిగే నేరాలను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు 1958లో ప్రవేశపెట్టిన ఆయుధ చట్టానికి ఈ బిల్లు సవరణ తీసుకువస్తోంది.
Tags:    

Similar News