అచ్చూ కేటీఆర్ వ‌లే లోకేష్‌కు క‌లిసివ‌చ్చింది

Update: 2017-04-03 14:42 GMT
ఎవ‌రు అవున‌న్నా కాద‌న్నా ప్ర‌స్తుతం తెలుగు రాష్ర్టాల్లో వార‌సత్వ రాజ‌కీయాల‌దే హ‌వా. ముఖ్యంగా పార్టీ ర‌థ‌సార‌థుల కుమారులే త‌మ తండ్రి త‌ర్వాత స‌ర్వం తాము అనే భావ‌న‌ను చేర‌వేడ‌యంలో విజ‌యం సాధించారు. ఇప్ప‌టికే తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న‌యుడైన కేటీఆర్ ఇదే రీతిలో మంత్రిగా త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్నారు. అటు ఏపీలో టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ ఇదే రీతిలో ట్రాక్ మీద‌కు వ‌చ్చారు. ముందుగా ఎమ్మెల్సీ ప‌ద‌వి చేప‌ట్టి అనంత‌రం మంత్రిగా ప్రమోష‌న్ పొందారు. అయితే ఇలా పొంద‌డంలోనే కేటీఆర్‌ను డిటో కాపీ కొట్టేసిన అభిప్రాయాన్ని లోకేష్ క‌లిగించిన‌ట్లు చెప్తున్నారు. 

తెలంగాణ‌లో మంత్రిగా ప‌ద‌వి బాధ్య‌త‌లు చేప‌ట్టిన స‌మ‌యంలో కేటీఆర్‌కు టీఆర్ఎస్ అధినేత రెండు శాఖ‌లు కేటాయించారు. ఒక‌టి ఐటీ శాఖ కాగా మ‌రొక‌టి పంచాయ‌తీ రాజ్ శాఖ‌. తాజాగా సేమ్ టు సేమ్ ఇదే ప‌నిని ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు చేశారు. త‌న కుమారుడు లోకేష్‌ను మంత్రి వ‌ర్గంలోకి తీసుకున్న బాబు స‌రిగ్గా ఆ రెండు శాఖ‌ల‌నే కేటాయించారు. తద్వారా కేటీఆర్‌తో లోకేష్‌కు పోటీ పెట్టారు! ఈ ఎపిసోడ్‌లో మ‌రో భిన్న‌మైన వాద‌న‌ను కొంద‌రు వినిపిస్తున్నారు. కేటీఆర్ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించిన మంత్రి ప‌ద‌వి పొందారు. అయితే లోకేష్ మాత్రం ఎమ్మెల్సీగా ఎన్నిక‌య్యార‌ని గుర్తుచేస్తున్నారు. అలా ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో నెగ్గ‌క‌పోవ‌డం ఈ ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య ఉన్న తేడా అని ప్ర‌స్తావిస్తున్నారు.

ఇదిలాఉండ‌గా.... మొద‌ట తీసుకున్న రెండు శాఖ‌ల‌లో రాణించిన కేటీఆర్ అనంత‌రం మ‌రో మూడు శాఖ‌ల‌ను అధ‌నంగా త‌న ఖాతాలో చేర్చుకున్న సంగ‌తి తెలిసిందే. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ జ‌ర‌గ‌న‌ప్ప‌టికీ శాఖ‌ల మార్పులు-చేర్పుల్లో భాగంగా కేటీఆర్‌కు ప‌రిశ్ర‌మ‌లు- చేనేత,గ‌నులు, ఎన్నారై శాఖ‌ల‌ను తెలంగాణ సీఎం కేసీఆర్ కేటాయించారు. మ‌రి ఇదే చాన్స్ లోకేష్‌కు కూడా వ‌స్తుందా? ఏమో వేచి చూడాల్సిందే!
Tags:    

Similar News