చినబాబు మీటింగ్.. ఈసారి ఎలాంటి షాకో..?

Update: 2015-12-15 05:06 GMT
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేశ్ ఈ మధ్య కాలంలో మాంచి జోరు మీదున్న సంగతి తెలిసిందే. పార్టీ కార్యకలాపాల విషయంలో ఆయన స్పీడ్ పెంచారు. రెండు రాష్ట్రాల్లోని పార్టీ కార్యకలాపాలపై ఆయన ప్రత్యేక దృష్టి సారిస్తూ విపరీతంగా శ్రమిస్తున్నారు. ఇంత కష్టపడుతున్నా తెలంగాణలో పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. మొన్నటికి మొన్న తెలంగాణ పార్టీ నేతలతో చినబాబు భేటీ అయి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లోపార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని సిద్ధం చేస్తున్న సమయంలోనే.. ఎమ్మెల్సీ అభ్యర్థులు జంప్ కావటం తెలిసిందే.

ఓ పక్క చినబాబు రివ్యూ చేస్తున్న సమయంలోనే.. ఇలాంటివి చోటు చేసుకోవటం ఒకపట్టాన జీర్ణించుకోలేని పరిస్థితి. తాజాగా మంగళవారం మరోమారు ఆయన తెలంగాణ తెలుగుతమ్ముళ్లతో భేటీ అవుతున్నారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో.. పార్టీ అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చించనున్నారు. మొన్నటి షాక్ నుంచి పార్టీ ఇంకా తేరుకోక ముందే.. తాజాగా మరోరివ్యూ పెట్టిన నేపథ్యంలో.. ఈసారి ఎలాంటి షాక్ తగులుతుందన్న ఆసక్తికర చర్చ పార్టీలో సాగుతోంది.
Tags:    

Similar News