కేంద్రం ఆదేశాల మేరకు గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం అమ్మకాలను ఆయా రాష్ట్రాలు ప్రారంభించాయి. ఏపీలో అయితే సినిమా టికెట్లకు కూడా అంత రద్దీ ఉండని రీతిలో మందుబాబులు కిలోమీటర్ల కొద్దీ క్యూలైన్లు కట్టి మద్యం కోసం ఎగబడ్డారు. కనీస భౌతిక దూరం పాటించకుండా ఒకరినొకరు తాకుకుంటూ తోసుకుంటూ.. క్యూల్లో తోపులాటలు.. ఎగబాట్లు కొనసాగాయి. దీంతో లాక్ డౌన్ పేరిట ఇన్నాళ్లు జనాలను ఇంట్లో ఉంచి కట్టడి చేసినందంతా ఈ ఒక్క మద్యం షాపులు ఓపెన్ చేయడంతో కృషి అంతా బూడిదలో పోసిన పన్నీరైంది..
లాక్ డౌన్ పేరిట.. దేశంలోని 130 కోట్ల మంది మొత్తం జనాభాను ఇంట్లో ఉంచి, బాధ్యతగా ఉండాలని ప్రధాని సూచించారు. నిబంధనలు సడలించిన మేరకు కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు మద్యం దుకాణాలను తెరిచాయి. దీంతో వైన్ షాపుల వద్ద పెద్ద జాతర కొనసాగింది. చారిత్రలోనే ఇంతలా మద్యానికి ఎగబడడం ఎప్పుడూ చూడలేదు. ఇక ప్రపంచంలోనే బెంగళూరులో ఉన్న అతిపెద్ద విదేశీ మద్యం షోరూమ్ ‘టోనిక్యూ’ కేవలం ఒక రోజులోనే 4 కోట్ల రూపాయల వ్యాపారం చేసింది. ఇది నమ్మశక్యం కాని నిజం.
అనేక రాష్ట్రాల్లోని వేలాది వైన్ షాపులు తొలిరోజే ఒక్కొక్కటి లక్షలు, కోట్లు వ్యాపారం చేశాయి. 41 రోజుల లాక్ డౌన్ తర్వాత తెరిచిన మద్యం షాపులకు ఇన్నాళ్లు తాగకుండా ఉగ్గబట్టుకొని ఉన్న మందుబాబులంతా పోటెత్తారు. మళ్లీ కేసులు పెరిగితే లాక్డౌన్ కొనసాగవచ్చని.. మద్యం దుకాణాలు మళ్లీ మూసివేయబడవచ్చని ఊహాగానాలు వెలువడడంతో ఒక్కొక్కరు 10 బాటిళ్లను కొనుగోలు చేసి తీసుకెళ్లడం గమనార్హం.
ప్రజల మద్యం దాహం ప్రభుత్వానికి వరమైంది. ఆర్థిక వ్యవస్థకు మద్యంతో వచ్చిన ఆదాయం చాలా సహాయపడింది. కాని ఇప్పుడు ఏమాత్రం సామాజిక దూరం పాటించకుండా మద్యం తీసుకున్న లక్షలాది మంది ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో ఉంది. స్టాక్ పూర్తయ్యేలోపు బాటిల్ పట్టుకోవాలనే కోరిక మిగతా వాటిలో ఆధిపత్యం చెలాయించడంతో సామాజిక దూరం పూర్తిగా విఘాతమైంది. దీంతో ఎంతమందికి కరోనా సోకుతుందనే భయం అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది.
హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ వైన్ షాపులు తెరవడానికి నిబంధనలు విధించారు. ఎలా నిర్వహించాలో వివరణాత్మక జాబితాను విడుదల చేశారు. అయినప్పటికీ అదంతా మద్యం ముందు విఫలమైంది. ఎర్రటి ఎండలోనూ పొడవైన క్యూలలో మద్యం కోసం జనాలు నిలబడ్డారు. అంత వేడిలోనూ దాదాపు ఏ మందుబాబు వైదొలగలేదు.. మందు కోసం కఠోరంగా ఆరాటపడ్డారు.
ఇప్పుడు ఇలా ఎగబడడం కంటే డోర్ డెలివరీ చేయడం బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు. 41 రోజులలో ఈ డోర్ డెలివరీ వ్యవస్థను అనుమతిస్తే ఇలాంటి ఉపద్రవాలు తగ్గి ఉండేవి. ఇప్పటికైనా అదే సరైన నిర్ణయమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇటువంటి గందరగోళాన్ని ఊహించకుండా వైన్ షాపులు తెరవడం అనేక రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమని రుజువు చేసింది. మద్యానికి డిమాండ్ కారణంగా అందరిలోనూ అది కావాలన్న పిచ్చి చేరింది. దీంతో ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాన్ని అనుమతించాలని పలు మద్యం కంపెనీలు.. పలువురు మంత్రులు మరియు రాష్ట్ర అధిపతులకు లేఖ రాశారు.