అయ్యో.. అలా జరిగిందా? అన్న వేదనకు గురి చేసే ప్రేమ ఉదంతమిది. ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకొని.. పెళ్లితో ఒక్కటైన వారు.. రోడ్డు ప్రమాదానికి బలి కావటం విషాదానికి గురి చేస్తోంది. సినిమాటిక్ స్టోరీని తలపించే ఈ ఉదంతంలోకి వెళితే.. కామారెడ్డి జిల్లా మోడెగాం గ్రామానికి చెందిన 24 ఏళ్ల సతీశ్.. హైదరాబాద్ కు చెందిన 22 ఏళ్ల ఠాకూర్ మహిమను ప్రేమించారు. వీరిద్దరి మధ్య కొంతకాలంగా ప్రేమకథ నడుస్తోంది. అన్ని ప్రేమకథల మాదిరే వీరి ప్రేమకు పెద్దలు నో చెప్పటంతో.. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.