షాకింగ్ నిజం.. ‘మా’ ఎన్నికల్లో ప్రలోభాలు.. మరెన్ని బయటకొస్తాయో?

Update: 2021-09-28 03:30 GMT
రాజకీయ ఎన్నికల్లో ఓటు కోసం ప్రలోభాలు మామూలే. చీప్ లిక్కర్.. ఓటుకు వెయ్యి.. రెండు వేలు.. కొన్నిసార్లు నాలుగైదు వేల రూపాయిలు ఇచ్చేందుకు సైతం వెనుకాడని పరిస్థితి. రాజకీయ ఎన్నికల్లో అలవాటైన ప్రలోభాల పర్వం తాజాగా పోటాపోటీగా సాగుతున్న ‘మా’ ఎన్నికలకు పాకిందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. గడిచిన కొంతకాలంగా ‘మా’ ఎన్నిక అంతకంతకూ క్లిష్టంగా మారుతోంది. గతానికి భిన్నంగా ఈ ఎన్నికల్లో పోటీ పడేవారు.. పొలిటికల్ ఎలక్షన్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో దీన్ని సవాలుగా తీసుకోవటం.. ఏమైనా గెలుపును సొంతం చేసుకోవాలన్నట్లుగా వారి తీరు మారిందని చెబుతున్నారు.

‘మా’ ఎన్నికలు వచ్చే నెల పదిన జరుగుతున్న సంగతి తెలిసిందే. దసరాకు ముందే ‘మా’ కొత్త అధ్యక్షుడు ఎవరన్న విషయంపై క్లారిటీ వచ్చేయనుంది. తాజాగా ప్రకాశ్ రాజ్ తన టీంతో కలిసి నామినేషన్ దాఖలు చేయటం తెలిసిందే. పోలింగ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ.. ఎవరి ప్రయత్నాల్లో వారు ఉంటున్నారు. గతానికి మించిన ఈసారి ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారటంతో ప్రతి ఓటు కీలకంగా మారింది. దాదాపు తొమ్మిది వందల మంది వరకు సభ్యులుగా ఉన్న ఈ అసోసియేషన్ లో గెలుపునకు పోటీ తీవ్రంగామారింది. గతానికి మించిన ఈసారి పోలింగ్ భారీగా సాగటం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజా  ఎన్నికల్లో ఓటర్లకు ప్రలోభాలకు గురి చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ప్రైవేటుగా భారీ పార్టీల్ని ఏర్పాటు చేస్తున్నారని.. పలు కమిట్ మెంట్లు ఇస్తున్నట్లు చెబుతున్నారు.పొలిటికల్ ఎలక్షన్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో సాగుతున్న ప్రచారం.. ప్రలోభాలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.  ఇదిలా ఉంటే.. తాజాగా మాట్లాడిన ప్రకాష్ రాజ్.. సభ్యులంతా మిగిలిన వారు ఇచ్చే తాయిలాల్ని తీసుకోవాలని.. ఓటు మాత్రం తమకే వేయాలని కోరుకున్నారు. దీంతో.. ‘మా’ ఎన్నికల్లో ప్రలోభాలు.. తాయిలాలు ఎంత ఎక్కువగా ఉన్నాయన్న విషయాన్ని ఆయన మాటలు చెప్పేస్తున్నాయని చెప్పక తప్పదు.
Tags:    

Similar News