తెలుగు సినీ రంగ ప్రముఖులకు చెందిన మా టీవీ ఛానల్ ఇప్పుడు ప్రఖ్యాత స్టార్ గుప్పిట్లోకి వెళ్లిపోయింది. అచ్చ తెలుగు వినోదాల ఛానల్ అయిన ‘‘మా’’ను మొదట్లో మురళీకృష్ణంరాజు ప్రారంభించినా.. తర్వాత రోజుల్లో అది కాస్తా మెగాస్టార్ చిరంజీవి.. నాగార్జున.. నిమ్మగడ్డ ప్రసాద్ లాంటి వారి చేతుల్లోకి వెళ్లిపోయింది. అనంతరం.. ఈ మాను స్టార్ కు అమ్ముతున్నట్లుగా వార్తలు వచ్చాయి.
ఈ డీల్ విలువ బయటకు రానప్పటికీ అనధికారికంగా దీని విలువ రూ.2500కోట్లు ఉంటుందని అప్పట్లో అంచనాలు వ్యక్తమయ్యాయి. దీనికి సంబంధించిన ప్రక్రియ అప్పట్లోనే మొదలైనా.. తాజాగా అధికారికంగా పూర్తి అయ్యింది.తాజాగా మా ఛానల్ కు సంబంధించి మా టీవీ.. మా గోల్డ్.. మా మ్యూజిక్.. మా మూవీస్ ఛానళ్లను స్టార్ ఇండియా కిందకు చేరిపోయినట్లుగా ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఫాక్స్అధీనంలోని స్టార్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. దీంతో.. ఇప్పటివరకూ తెలుగువారి ‘మా’ కాస్తా.. ఇంగ్లిషోడి స్టార్ కిందికి వెళ్లిపోయాయి. ప్రపంచ మీడియాలో అత్యంత శక్తివంతుడైన రూపక్ మర్దోక్ కు చెందిన స్టార్ చేతుల్లోకి వెళ్లిపోయిన ‘మా’ రూపురేఖలు రానున్న రోజుల్లో ఎలా మారనున్నాయి? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు.