బ్రేకింగ్ న్యూస్ : వైసీపీ నేత దారుణ హత్య !

Update: 2020-06-29 13:30 GMT
కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో వైసీపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. మచిలీపట్నంలో వైసీపీ నేత, మంత్రి పేర్ని నాని ముఖ్య అనచరుడు మోకా భాస్కరరావు దారుణ హత్యకు గురయ్యారు. సోమవారం చేపల మార్కెట్‌కి వెళ్లిన మోకా భాస్కర్‌ రావుని గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసి పరారయ్యారు. దుండగుల దాడిలో తీవ్ర గాయాలపాలైన భాస్కరరావును స్థానికులు హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు ఈ హత్యలో ఇద్దరు యువకులు పాల్గొన్నట్లు ప్రత్యక్ష స్యాక్షులు చెబుతున్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఆయన్ని హత మార్చారని మోకా భాస్కర్ రావు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా ఆయన మృతికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. భాస్కర రావు హత్య వార్త తెలుసుకొని వైసీపీ కార్యకర్తలు ఆస్పత్రి వద్దకు భారీగా చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు మోహరించారు. కాగా, భాస్కరరావు గతంలో మచిలీపట్నం మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా పనిచేశారు.
Tags:    

Similar News