మ‌ద్దాలి గ‌రంగ‌రం.. వైసీపీలో లుక‌లుక‌లు..!

Update: 2022-09-26 04:56 GMT
పార్టీ మారారు. జ‌గ‌న్‌కు జైకొట్టారు. ఇంత వ‌ర‌కు చాలా హ్యాపీ. కానీ.. వెన‌క్కి తిరిగి చూసుకుంటే.. ఆయ‌న‌కు తీవ్ర‌మైన  వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. దీంతో ఆయ‌న హ‌డ‌లి పోతున్నార‌ని.. చెబుతున్నారు. ఆయ‌నే గుంటూరు ప‌శ్చిమ ఎమ్మెల్యే.. మ‌ద్దాలి గిరిధ‌ర్‌. అన్ని స‌మ‌యాలూ.. ఒకేలా ఉండ‌వు క‌దా.. అలానే ఇక్క‌డ‌కూడా.. ఆయ‌న ప‌రిస్థితి ఏమంత బాగాలేద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకుని.. వైసీపీలోకి జంప్ చేశారు.

కొన్నాళ్లు బాగానే ఉంది. కానీ, ఆయ‌న ప్రెండ్, వ్యాపార భాగ‌స్వామి.. వెల్లంప‌ల్లి శ్రీనివాస‌రావుకు.. మంత్రి ప‌దవి పోవ‌డంతో.. మ‌ద్దాలి మౌనంగా మారిపోయార‌ట‌. ఒకప్పుడు.. త‌న సామాజిక వ‌ర్గం.. రెడ్ కార్పెట్ ప‌రిచి.. ఆయ‌న‌ను గౌర‌విస్తే.. ఇప్పుడు మాత్రం.. ఆయ‌న‌ను అస‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అంటున్నారు.

దీనికి తోడు.. వైసీపీలో య‌ధాలాపంగా.. అంత‌ర్గ‌త కుమ్ములాటలు వేధిస్తున్నాయి. అంతేకాదు.. మ‌ద్దాలికి జైకొట్టే నాయ‌కులు కూడా క‌నిపించ‌డం లేదు.

ఇక‌, అధిష్టానం చేయించిన స‌ర్వేల్లో.. మ‌ద్దాలి హ‌వా పెద్ద‌గా లేద‌ని.. పార్టీ మార్పుపై.. ప్ర‌జ‌ల మ‌రో విధంగా భావిస్తున్నార‌ని.. తేలింద‌ట‌. దీంతో ఆయ‌న‌కు మ‌ళ్లీ టికెట్ ఇస్తారా?  లేదా..? అనేది సందేహంగా మారింద‌ట‌.

ఈ క్ర‌మంలో వైసీపీ నాయ‌కులు కూడాఆయ‌న‌ను దూరంగా ఉంచారు. కీల‌క‌మైన నాయ‌కులు ఆయ‌న‌కు దూరంగా జ‌రుగుతున్నారు. దీంతో వైసీపీలోకి వ‌చ్చి త‌ప్పు చేశానా? అని మ‌ద్దాలి అంత‌ర్మ‌థ నం చెందుతున్నారు. అంతేకాదు.. ఎవ‌రూ త‌న‌తో ట‌చ్‌లోకి రాక‌పోవ‌డంతో.. ఆయ‌న కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు.

ఇక‌,  మ‌ళ్లీ టీడీపీలోకి రీ ఎంట్రీ ఇచ్చే ఆలోచ‌న ఉన్న‌ట్టు.. ప్ర‌చారం అయితే.. జ‌రుగుతోంది. కానీ, దీనికి సంబంధించి ఎలాంటి సంకేతాలు రావ‌డం లేదు. ఎందుకంటే.. తిరిగి పార్టీలోకి వ‌చ్చినా.. టీడీపీ స్థానిక నేత‌లు.. ఆయ‌న‌ను రిసీవ్ చేసుకోవ‌డం.. క‌ష్ట‌మ‌నే భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఎందుకంటే.. గ‌త ఎన్నిక‌ల్లో మ‌ద్దాలి కోసం ప‌నిచేసిన‌.. వారికి ఆయన ఏమీ చేయ‌లేదు. పైగాపార్టీ మారిపోయారు. అలాంటి నాయ‌కుడికి  తిరిగి టికెట్ ఇస్తే.. తామెందుకు ప‌నిచేయాల‌నేది ఇక్క‌డి నేత‌ల భావ‌న . ఎలా చూసుకున్నా.. మ‌ద్దాలికి రెండుప‌క్క‌లా.. ఇబ్బందులు క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News