ఈ రాడ్స్ గొడవ ఏంటమ్మా.. కంప్లైంట్ చేశాకా?

Update: 2021-02-06 16:30 GMT
సోషల్ మీడియాలో తనపై నీచంగా కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారని బీజేపీ నాయకురాలు, నటి మాధవీలత హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనను వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఏకంగా సీపీ సజ్జనార్ ను కలిసి విన్నవించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన మాధవీలత ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్, టీఆర్ఎస్ తోపాటు పలు పార్టీల కార్యకర్తలను టార్గెట్ చేస్తూ దారుణంగా వారి మాటలను వివరించారు. దారుణమై బూతులు తిడుతున్నారని.. ట్రోలింగ్ చేస్తున్నారని.. తాను ఏదో కేసులో పట్టుబడ్డానని రాతలు రాస్తున్నారని ఆమె మండిపడింది.

ఈ క్రమంలోనే టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. ఏపీలో ఆలయాలపై దాడులు చేస్తే మాట్లాడొద్దా? మాట్లాడితే ట్రోల్స్ చేస్తారా అని మాధవీలత చెప్పుకొచ్చారు. ఆలయాలపై దాడుల గురించి ప్రశ్నిస్తే.. తనను కొందరు వైసీపీ సానుభూతి నెటిజన్లు ‘రాడ్లు దించుతాం.. రోడ్డుపై కనపడితే పిచ్చ కొట్టుడు కొడుతామని’ పోస్టులు పెడుతున్నారని మాధవీలత పేర్కొంది. వాళ్లు ఎక్కడ రాడ్లు దించుతారో చూస్తా.. నాజోలికి వస్తే నేను నోర్మూసుకొని ఇంట్లో కూర్చోనే వ్యక్తిని కాదంటూ మాధవీలత హెచ్చరించారు.

అయితే మాధవీలత తనకు జరిగిన అన్యాయంపై పోరాడితే ఎవరూ కాదనరు. కానీ నెటిజన్లు తిట్టిన అసభ్య పదాలను కూడా మీడియా ముందు మాట్లాడడాన్ని కొందరు తప్పు పడుతున్నారు. సోషల్ మీడియా అన్నాక మాధవీలతనే కాదు.. పెద్ద పెద్ద దిగ్గజాలపైనే బండ బూతులతో చాలా మంది తిట్టిపోస్తున్నారు. వారంతా వాటిని లైట్ తీసుకుంటున్నారు.కానీ మాధవీలత దారుణ పదజాలాన్ని మీడియా ముందు చెప్పడం చూసి అందరూ అవాక్కయ్యారు. నెటిజన్లు తీసే పరువు కంటే మాధవీలతనే చెప్పడం వల్లే పరువు మరింతగా పోతోందని.. ఇప్పటికైనా ఆమె తనను తిట్టిన వారిపై పోరాడాలని పలువురు సూచిస్తున్నారు. మీడియాకు ఎక్కితే అనవసరంగా పరువు పోతుందని చెబుతున్నారు. చిన్న విషయాన్ని భూతద్దంలో చూపించే మీడియా ముందు ఇలాంటి విషయాలు మాట్లాడకుంటే ఉండి ఉంటే ఆమెకు బాగుండేది సలహా ఇస్తున్నారు. తిట్టిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాక ఇలా మీడియా ముందు గొడవ చేయడం ఏంటమ్మా అని పలువురు హితవు పలుకుతున్నారు.




Tags:    

Similar News