కేసీఆర్ ను గాడిదెక్కించాలన్న మాజీ ఎంపీ

Update: 2016-08-16 07:24 GMT
తెలంగాణ‌ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ పై నిజామాబాద్ మాజీ ఎంపీ మ‌ధుయాష్కీ చేసిన సంచ‌ల‌న వ్యాఖ్యలపై టీఆరెస్ నేతలు మండిపడుతున్నారు.  మధు యాష్కీ వ్యవహారాలు తమకు తెలుసని.. తాము నోరు విప్పితే ఆయన సమాధానం కూడా చెప్పలేరని అంటున్నారు.  కాగా అభివృద్ధి ప‌నుల  విష‌యంలో లేనిది ఉన్న‌ట్లుగా చూపిస్తోన్నకేసీఆర్ ను గాడిద మీద ఎక్కించి ఊరేగించాల‌ని యాష్కీ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

హైద‌రాబాద్‌ లో ప్రెస్ మీట్ పెట్టిన మ‌ధుయాష్కీ కేసీఆర్ కుటుంబంపై విరుచుకుప‌డ్డారు. సీఎం కేసీఆర్ కుటుంబం సెటిల్ మెంట్ల‌తో కాలం గడుపుతోంద‌ని ఆరోపించారు. అల్లుడు ఇసుక వ్యాపారం - కూతురు భూముల సెటిల్‌ మెంట్లు - కుమారుడు ప్ర‌త్యేక విమానాల్లో విదేశీ ప్ర‌యాణాలు చేయడంతోనే సరిపోతోందని విమ‌ర్శించారు. వీరంతా ప్ర‌జలసొమ్మును త‌న సొంత ప్ర‌యోజ‌నాల‌కు దుర్వినియోగం చేస్తున్నార‌ని ఆరోపించారు.

మిష‌న్ భ‌గీర‌థ దేశంలోనే అతిపెద్ద కుంభ‌కోణ‌మ‌ని ఆరోపించారు. మ‌హ‌రాష్ట్రతో సాగునీటి విష‌యంలో ఒప్పందం జ‌రిగిపోయిన‌ట్లుగా ప్ర‌చారం చేసుకుంటున్న కేసీఆర్‌ను గాడిద మీద ఊరేగించాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.  నయీం ఎన్ కౌంటర్ పైనా మధు ఆరోపణలు చేశారు.. భూ వివాదాల్లో కేసీఆర్‌ స‌న్నిహితుల‌కు న‌యీం మ‌ధ్య త‌గాదాలు వ‌చ్చినందు వ‌ల్లే అత‌న్ని ఎన్‌ కౌంట‌ర్ చేయించార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.  కేవీపీ రామ‌చంద్ర‌రావు – కేసీఆర్‌ లు బినామీ పేర్ల‌తో తెలంగాణ‌లో ప‌లు వ్యాపారాలు చేస్తున్నార‌ని.. దీనిపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని ఆయన అన్నారు.
Tags:    

Similar News