సంచలన తీర్పును ఇచ్చింది మద్రాస్ హైకోర్టు. అన్నదాతల ఆక్రోశంపై ఊహించనిరీతిలో రియాక్ట్ అయిన మద్రాస్ హైకోర్టు.. వారికి ఊరట ఇచ్చేలా తాజా తీర్పుఉండటం గమనార్హం. దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతుల ఆందోళనల నేపథ్యంలో.. సహకార సంఘాల నుంచి రైతులు తీసుకున్న రుణాల్ని మాఫీ చేయాలంటూ మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ సంచలన తీర్పును ఇచ్చింది.
కరవు నేపథ్యంలో సహకార సంఘాల నుంచి తీసుకున్న రుణాల్ని రద్దు చేయాల్సిందిగా కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రైతులు గడిచిన 23 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. తమ డిమాండ్లను తీర్చకుంటే.. గొంతు కోసుకొని చచ్చిపోతామంటూ వారు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వేళ.. రైతుల రుణమాఫీ అంశంపై దాఖలైన పిటీషన్‌ను విచారించిన న్యాయమూర్తులు.. రుణగ్రస్తులైన అన్నదాతలకు రుణమాఫీని అమలు చేయాలని.. సహకార సంఘాలు ఇచ్చిన రుణాన్ని మాఫీ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
ఈ తీర్పుపై రైతులు.. రైతు సంఘాలు హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్నాయి. మద్రాస్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో.. పలు రాష్ట్రాల రైతుల్ని కోర్టు బాట పట్టేలా చేసే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏమైనా రైతుల వెతల్ని గుర్తించటంలో పాలకులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నా.. కోర్టులు మాత్రం బాధ్యతగా వ్యవహరించి రైతులకు భారీ ఉపశమనాన్నికలిగించాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/