ఒంగోలు మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం ఖరారు అయ్యిందనే వార్తలు పాతవే. తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి టికెట్ విషయంలో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినా, నెల్లూరు లేదా ఒంగోలు ఎక్కడ నుంచి అయినా పోటీ చేసుకోవచ్చని బంపర్ ఆఫర్ ఇచ్చినా.. ఆయన మాత్రం ఆ ఆఫర్లకు తలూపలేదు. దాంతో అప్పుడే.. ఆయన తెలుగుదేశం పార్టీని వీడటం ఖాయమైనందని వార్తలు వచ్చాయి.
అయితే మాగుంట వైసీపీ ఎంట్రీ విషయంలో కొన్ని అభ్యంతరాలున్నాయని, ఒంగోలు ఎంపీ టికెట్ ను త్యాగం చేయడానికి వైవీ సుబ్బారెడ్డి రెడీగా లేరని.. దీంతో ఆయన అలిగారని కూడా ప్రచారం జరిగింది. ఆ సంగతేమో కానీ.. మాగుంట వైసీపీ ఎంట్రీకి లైన్ క్లియర్ అయ్యిందని సమాచారం.
రేపే మాగుంట వైసీపీలోకి చేరబోతున్నట్టుగా సమాచారం. ఈ రోజు సాయంత్రమే అందుకు సంబంధించిన ప్రెస్ మీట్ కూడా ఉండబోతోందని తెలుస్తోంది. ఆ ప్రెస్ మీట్లో మాగుంట పూర్తి వివరాలను ప్రకటించనున్నారని, ఆయన వైసీపీలోకి చేరడం లాంఛనమేని తెలుస్తోంది.
శనివారం రోజున వైసీపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది.ఈ నేపథ్యంలో రేపు ఆయన వైసీపీలోకి చేరబోతున్నారు. మరి మాగుంట టికెట్ ఒంగోలు నుంచినే కన్ఫర్మా లేక నెల్లూరు నుంచినే అనే అంశంపై కూడా ఈ రోజే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.