కేసీఆర్ ను గద్దెదించడమే ధ్యేయంగా ‘మహాకూటమి’కి అంకురార్పణ జరుగుతోంది. రానున్న ఎన్నికల్లో బలమైన టీఆర్ఎస్ ను ఓడించేందుకు తెలంగాణలోని ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో రాజకీయ వేదిక ఏర్పాటు దిశగా ముందడుగు వేశాయి. కలిసి పనిచేయాలని కాంగ్రెస్ - టీడీపీ - సీపీఐ నిర్ణయానికి వచ్చాయి. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో జరిగిన మూడు పార్టీల సమావేశంలో ఓ నిర్ణయానికి వచ్చారు.
ఈ మహాకూటమి చర్చల్లో కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ - భట్టి - గూడురు నారాయణ రెడ్డి పాల్గొనగా.. టీడీపీ నుంచి ఎల్. రమణ - పెద్దిరెడ్డి - రేవూరి ప్రకాష్ రెడ్డి - సీపీఐ నుంచి చాడా వెంకటరెడ్డి - కూనంనేని సాంబశివరావులు హాజరయ్యారు. రాష్ట్రంలో కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడాలంటే భావసారుప్యం ఉన్న పార్టీలు కలిసి పనిచేయాలని నేతలు అభిప్రాయపడ్డారు. టీఆర్ ఎస్ ను గద్దెదించేందుకు ఉమ్మడిగా ముందుకు వెళ్లాలని..కలిసి వచ్చే అన్ని పార్టీలు - ప్రజాసంఘాలను కలుపుకు పోవాలని నిర్ణయించారు.
*సీట్లపై కసరత్తు
మహాకూటమి ఏర్పాటు.. ముఖ్యంగా సీట్లపైనే ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలిసింది. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీచేయాలి.? గెలిచే స్థానాల్లో పోటీచేయడంపై దృష్టి పెట్టాలనే దానిపై కసరత్తు చేయాలని నిర్ణయించారు. అన్ని పార్టీలు - ప్రజాసంఘాలను మిళితం చేసి సీట్ల పంపకాలపై లెక్క తేల్చాలని నిర్ణయించారు. కూటమి ఏర్పాటు తర్వాత భారీ బహిరంగ సభతో ప్రజల్లోకి వెళ్లి ఎన్నికల శంఖారావం పూరించాలని నిర్ణయించారు.
* యూపీఏ ఫార్ములా..
2004లో సార్వత్రిక ఎన్నికల కోసం కాంగ్రెస్ యూపీఏను ఏర్పాటు చేసి కనీస ఉమ్మడి ప్రణాళిక తయారు చేసి ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజల ముందు ఉంచింది. ఇప్పుడు రాష్ట్రంలో అదే ఫార్ములాను అనుసరించాలని రాష్ట్రంలో కాంగ్రెస్ నిర్ణయించింది. మహాకూటమిలోని అన్ని పార్టీల మేనిఫెస్టోలను కలిపి కామన్ అంశాలతో ఒక మేనిఫెస్టోను రూపొందించి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. ఉమ్మడి ప్రణాళికతో తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే దాన్ని ప్రజలకు వివరించాలని నిర్ణయించారు.
*సీపీఎం - టీజేఎస్ తోనూ చర్చలు
మహాకూటమిలోకి తెలంగాణలో మిగిలిన సీపీఎం, కోదండరాం టీజేఎస్ లను ఆహ్వానించాలని నిర్ణయించారు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంకు ఫోన్ చేశారు. సీపీఎం కూడా భాగస్వామి కావాలని కోరారు. వారితో సంప్రదింపులు జరపాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ - ఎల్. రమణ - చాడ వెంకటరెడ్డిలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ ను గద్దె దించడమే ధ్యేయంగా మహాకూటమితో ప్రతిపక్షాలన్నీ కలిసి పోటీచేస్తాయని తెలిపారు. అందరినీ కలుపుకొని పోయి కేసీఆర్ ను ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు.