అత్యాచారం చేయలేదు..రిలేషన్ షిప్ లో ఉన్నా..మహారాష్ట్ర మంత్రి సంచలన కామెంట్స్!

Update: 2021-01-13 11:30 GMT
మహారాష్ట్ర సాంఘిక సంక్షేమ, న్యాయశాఖ మంత్రి ధనంజయ్ ముండే తనపై అత్యాచారం చేశాడని ఓ మహిళ (38) ఆరోపణలు చేయగా.. ఈ విషయం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఆరోపణలపై మంత్రి ధనుంజయ్ స్పందించారు. తనపై సదరు మహిళ తప్పుడు ఆరోపణలు చేస్తోందని, నిజానికి ఆమె సోదరి తాను కొన్నేళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్నట్లు వెల్లడించారు. తనపై ఆరోపణలు చేసిన మహిళ,ఆమె సోదరి తన వద్ద నుంచి డబ్బు గుంజేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మంత్రి తెలిపారు. తనపై ఆరోపణలు చేస్తున్న మహిళ సోదరితో 2003 నుంచి తాను రిలేషన్ లో ఉన్నానని, తమకు ఇద్దరు పిల్లలు కూడా కలిగారని చెప్పారు. ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ల దృష్టికి కూడా తీసుకు పోగా వారు తమ బంధానికి అంగీకారం తెలిపినట్లు వెల్లడించారు. అయితే ఉన్నట్లుండి ఆ మహిళలు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.


ధనంజయ్ ముండే తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడినట్లు రెండు రోజుల కిందట ఓ మహిళ ఒడిషాలోని అంధేరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై ఆమె తరపు లాయర్ మాట్లాడుతూ బాధితురాలికి ధనంజయ్ కి మధ్య 1997 నుంచి పరిచయం ఉందని, బాలీవుడ్లో సింగర్ గా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి ధనుంజయ్ ఆమెతో పరిచయం పెంచుకున్నట్లు చెప్పాడు. 2008 లో ముండే తొలిసారి బాధిత మహిళ పై అత్యాచారం చేశాడని, అప్పట్నుంచి లైంగికదాడికి పాల్పడు తూనే ఉన్నాడని తెలిపాడు.

2019 లో ఆమె తనను వివాహం చేసుకోవాలని ధనుంజయ్ ని కోరగా అతడు అంగీకరించలేదని చెప్పాడు. ఈ విషయమై ఎవరికైనా చెబితే తనతో సన్నిహితంగా మెలిగినప్పటి వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరించాడని, దీంతో ధనుంజయ్ పై ఫిర్యాదు చేసినట్లు బాధిత మహిళ తరపు లాయర్ పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు పోలీసులు ధనుంజయ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదని దీనిపై మేము కోర్టుకు వెళ్తామని, ఒకవేళ బాధిత మహిళకు ఏదైనా ప్రమాదం వాటిళ్ళితే అందుకు ధనుంజయ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా లాయర్ పేర్కొన్నారు.

కాగా మహిళపై తాను అత్యాచారం చేయలేదని, కొన్నేళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్నానని మంత్రి ధనుంజయ్ ప్రకటన చేయగానే మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్పందించారు. ఆయన్ను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కి లేఖ రాశారు. ప్రస్తుతం మహారాష్ట్రలో మంత్రి ధనుంజయ్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.


Tags:    

Similar News